Share News

Revanth Reddy: కవిత అరెస్ట్‌పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ABN , Publish Date - Mar 16 , 2024 | 01:49 PM

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో తండ్రిగా కేసీఆర్ ఇంకా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పార్టీ సభ్యురాలిగా కూడా కవితను చూడడం లేదన్నారు.

Revanth Reddy: కవిత అరెస్ట్‌పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత విషయంలో తండ్రిగా కేసీఆర్ (KCR) ఇంకా రియాక్ట్ కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం పార్టీ సభ్యురాలిగా కూడా కవితను చూడడం లేదన్నారు. ప్రధాని మోదీ (PM Modi) సైతం దీనిపై స్పందించడం లేదన్నారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబ్ ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మోదీ, కేసీఆర్ డ్రామాలు ఆపాలన్నారు.

MLC Kavitha: కవిత తరుఫున లాయర్ విక్రమ్ వాదనలేంటంటే..

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress)ను దెబ్బ కొట్టేందుకు నాటకం ఆడుతున్నారని రేవంత్ అన్నారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్ కుటుంబం, బీజేపీ (BJP) ప్రభుత్వం సీరియల్‌లో మాదిరిగా డ్రామా చేస్తున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కవితను అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని రేవంత్ ప్రశ్నించారు. ఇద్దరూ కలిసి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ చేస్తున్నారన్నారు. ఈ డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముందు ఈడీ వస్తుందని.. ఆ తర్వాత మోదీ వస్తారని గతంలో అనేవారని.. కానీ నిన్న ఈడీ, మోదీ కలిసే వచ్చారని రేవంత్ సెటైర్ వేశారు.

CM Revanth: వంద రోజుల పాలనపై సీఎం రేవంత్ తాజా కామెంట్స్ ఇవే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 16 , 2024 | 01:49 PM