Share News

Ramulu Naik: ఓట్ల కోసం కేసీఆర్ ఆ పని చేయలేదా..?

ABN , Publish Date - Feb 06 , 2024 | 05:59 PM

పదేళ్లలో మహాత్మా జ్యోతిరావు పూలే కల్వకుంట్ల కవితకు గుర్తుకు రాలేదా..? అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్(Ramulu Naik) ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన సబ్ ప్లాన్, మూడెకరాల భూమి ఏమైంది.. ? అని నిలదీశారు.

Ramulu Naik: ఓట్ల కోసం కేసీఆర్ ఆ పని చేయలేదా..?

హైదరాబాద్: పదేళ్లలో మహాత్మా జ్యోతిరావు పూలే కల్వకుంట్ల కవితకు గుర్తుకు రాలేదా..? అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్(Ramulu Naik) ప్రశ్నించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన సబ్ ప్లాన్, మూడెకరాల భూమి ఏమైంది.. ? అని నిలదీశారు. సలాంలు, గులాంలు చేసిన వారికే దళిత బంధు ఇచ్చారన్నారు. బీసీల గురించి, జ్యోతి రావు పూలే గురించి మాట్లాడే నైతిక హక్కు గులాబీ నేతలకు లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాజిక వర్గాలు, కార్పొరేషన్లు అన్ని నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు.

ఓట్ల కోసమే కేసీఆర్ తెలంగాణలో సామాజిక వర్గాలను వాడుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయి కల్వకుంట్ల కుటుంబం మైండ్ బ్లాంక్ అయ్యిందన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కల్వకుంట్ల తరం సరిపోతదా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మొన్నటి అసెంబ్లీలో తగిన గుణపాఠం చెప్పిన కల్వకుంట్ల కుటుంబానికి సిగ్గు రాలేదని దెప్పిపొడిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు ప్రజలు అదే గుణపాఠం చెబుతారని రాములు నాయక్ హెచ్చరించారు.

Updated Date - Feb 06 , 2024 | 05:59 PM