Share News

Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డికు ఆ విషయం ఎలా తెలుసు

ABN , Publish Date - Feb 24 , 2024 | 10:25 PM

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి, బీఆర్ఎస్ పొత్తు అని తనకెలా తెలుసునని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు. ‘భారత్ వికసిత సంకల్ప యాత్ర’లో రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి, పులిమమిడి రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డికు ఆ విషయం ఎలా తెలుసు

సంగారెడ్డి జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి, బీఆర్ఎస్ పొత్తు అని తనకెలా తెలుసునని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు. ‘భారత్ వికసిత సంకల్ప యాత్ర’లో రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి, పులిమమిడి రాజు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ... ‘‘రేవంత్ రెడ్డి గారు మీరు ఏ పార్టీకి అధ్యక్షులు..? బిఆర్ఎస్ కా..? కాంగ్రెస్‌కా..? బీజేపీకా...?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు గానూ 17 బీజేపీ గెలవనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు ఒకటవుతుంది..? అని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడైనా కలిసి పోటీ చేశాయా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కే కేసీఆర్ దోస్తు అవుతారు..!

పదేళ్లుగా మంత్రిగా ఉన్న హరీష్ రావు సంగారెడ్డికి ఎంత అన్యాయం చేశాడో గుర్తుంచుకోవాలని అన్నారు. సంగారెడ్డికి మెట్రో రైలు కోసం ఏ రోజయినా జగ్గారెడ్డి... సీఎంకి వినతిపత్రం ఇచ్చారా..? అని ప్రశ్నించారు. జగ్గారెడ్డి నువ్వు సంగారెడ్డి ప్రజలను బహిష్కరించడం కాదు వాళ్లే తనను బహిష్కరించారని విమర్శించారు. తనకు చేతనైతే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు నూతన రైలు మార్గం ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, కేజ్రీవాల్, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ ఇండియా కూటమిలో ఉన్నారా.. లేరా..? అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఉంటే అతనికి కేసీఆర్ దోస్తు కదా అని నిలదీశారు. కేజ్రీవాల్ దోస్తీ కేసీఆర్, కేజ్రీవాల్ కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు కాబట్టి.. కాంగ్రెస్‌కి కేసీఆర్ దోస్తువుతారు కదా..? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Updated Date - Feb 24 , 2024 | 10:25 PM