Share News

ACB: ఏసీపీ కస్టడీ కోరుతూ కోర్టులో ఏసీబీ పిటిషన్.. నేడు విచారణ..

ABN , Publish Date - May 24 , 2024 | 08:34 AM

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అరస్టయి, రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేయనుంది.

ACB: ఏసీపీ కస్టడీ కోరుతూ  కోర్టులో ఏసీబీ పిటిషన్.. నేడు విచారణ..

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో అరస్టయి, రిమాండ్‌లో ఉన్న ఏసీపీ (ACP) ఉమామహేశ్వరరావు (Umamaheswararao)ను కస్టడీ (Custody) కోరుతూ ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లి కోర్టు (Nampalli Court)లో పిటిషన్ (Petition) వేశారు. 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, వ్యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై విచారణ చేయనున్నారు. ఉమామహేశ్వరరావు లాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను కస్టడీలో ఏసీబీ అధికారులు తెరవనున్నారు.


కాగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ సీసీఎస్‌లో ఏసీపీ (టీమ్‌-3)గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మూడు రోజుల క్రితం నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని ఆయన ఇంటితో పాటు.. ఆయన సంబంధీకుల ఇల్లతో సహా.. తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో మూడు చోట్ల (విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగాలిపాలెం, అనకాపల్లి జిల్లా రోలుగుంట, చోడవరం).. కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఉమామహేశ్వరరావు సాహితీ ఇన్‌ఫ్రా ప్రీ లాంచ్‌ పేరుతో జరిగిన రూ.1500 కోట్ల మోసం కేసులో కీలక విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడం, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సురేంద్ర తెలిపారు. ఇప్పటిదాకా నిర్వహించిన సోదాల్లో రూ.37.5 లక్షల నగదు.. 60 తులాల బంగారం, 17 విలువైన ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయనకు ఘట్‌కేసర్‌లో 5 చోట్ల, శామీర్‌ పేట, కూకట్‌పల్లి, మల్కాజిగిరిలో ఒక్కొక్కచోట, వైజాగ్‌, చోడవరంలో ఏడు చోట్ల, అశోక్‌నగర్‌లో ఏడుచోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. శామీర్‌పేటలో ఒక విల్లా కొనుగోలు చేసినట్టు తెలిసిందని ఏసీబీ జేడీ వెల్లడించారు. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.3.46 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.25 కోట్లకు పైగానే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. అధికారులు స్వాధీనం చేసుకున్న ఒక డైరీలో సందీప్‌ అనే పేరు రాసి ఉన్నట్టు సమాచారం. అది పోలీస్‌ అధికారి పేరేనా అని విలేకరులు ప్రశ్నించగా.. దానిపై పూర్తి స్పష్టత లేదని, ఉమామహేశ్వరరావు సైతం దానిపై ఎలాంటి సమాధానం చెప్పలేదని ఏసీబీ జేడీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌

ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 24 , 2024 | 09:08 AM