Share News

MLC Venkat: నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న కవిత

ABN , Publish Date - Mar 05 , 2024 | 05:40 PM

గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని చెప్పి నిరుద్యోగుల పొట్టకొట్టిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmoor Venkat) అన్నారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను చేపట్టారని చెప్పారు. గత ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

 MLC Venkat: నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్న కవిత

హైదరాబాద్: గత కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని అని చెప్పి నిరుద్యోగుల పొట్టకొట్టిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmoor Venkat) అన్నారు. మంగళవారం నాడు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను చేపట్టారని చెప్పారు. గత ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మహిళలను, నిరుద్యోగులను కవిత తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. జీవో3 పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో నిరుద్యోగులకు న్యాయం చేస్తున్నారని అన్నారు. మెగా డీఎస్సీ, గ్రూప్1 ఉద్యోగాల నోటిఫికేషన్ వేశామని తెలిపారు.

ఇప్పటికే 30వేల ఉద్యోగాలను తమ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ హైకోర్టు డైరెక్షన్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫాలో కాలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఆర్డర్లను పరిగణనలోకి తీసుకుని తాము నియామకాలు చేపడతామని చెప్పారు. ప్రతీ ఏడాది జాబ్ కాల్యెండర్ ప్రకారం ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు ఎవరు అన్యాయం చేశారో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ధర్నా చౌక్ లేదా ఓయూలో ఎమ్మెల్సీ కవిత చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే మహిళలకు పెద్దపీఠ వేస్తుందని చెప్పారు. మహిళల కోసం ఏ ఒక్క రోజు కూడా కవిత మాట్లాడలేదన్నారు. 9 ఏళ్ల నుంచి నిరుద్యోగుల కోసం తాను పోరాడానని.. వాళ్ల సమస్యలు తనకు తెలుసునని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ధర్నా చౌక్‌ను బీఆర్ఎస్ ఎత్తి వేసిందని.. తాము పునరుద్ధరించామని అన్నారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

Breaking: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు

Malreddy Rangareddy: సీఎం రేవంత్ మర్యాదిస్తే.. ప్రధాని నిలబెట్టుకోలేదు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 05 , 2024 | 05:58 PM