Share News

Breaking: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు

ABN , Publish Date - Mar 05 , 2024 | 04:09 PM

Telangana Parliament Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS).. బీఎస్పీ (BSP) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మంగళవారం నాడు రాష్ట్ర బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను (KCR) కలిసిన సంగతి తెలిసిందే...

Breaking: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖరారు

తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS).. బీఎస్పీ (BSP) పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మంగళవారం నాడు రాష్ట్ర బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar).. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను (KCR) కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుపై నిశితంగా చర్చించడం జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎన్నికల నేపథ్యంలో ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. విధి విధానాలు త్వరలో ఖరారు కానున్నాయని ఇరు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. కాసేపట్లో కేసీఆర్, ప్రవీణ్ కుమార్ ఇరువురూ మీడియా ముందుకు వచ్చి పొత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయబోతున్నారు.

Updated Date - Mar 05 , 2024 | 04:15 PM