Share News

Congress: కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:15 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.

Congress: కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేపు(సోమవారం) అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమావేశం ప్రత్యేకత సంతరించుకుంది. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ దాదాపు గంటకుపైగా జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ వివరించారు.

ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణ జలాల్లో వాటా శాతం ఎంత..? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాలను అధికారులు, మంత్రి ఉత్తమ్ వివరించారు. తెలంగాణలో కృష్ణ పరివాహక ప్రాంతం 68 శాతం ఉన్నా, రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33 శాతం నీటి వాటాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది. శ్రీశైలం నుంచి గత పదేళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను గూగుల్ మ్యాప్ ద్వారా మంత్రి ఉత్తమ్ వివరించారు.

Updated Date - Feb 11 , 2024 | 10:15 PM