Share News

TS Politics: ఆయనతో అయ్యేది లేదు.. పోయ్యేది లేదు.. మల్లారెడ్డి మాస్ కామెంట్స్

ABN , Publish Date - Feb 16 , 2024 | 06:04 PM

మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్‌పై మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో తమకు పొత్తు ఉన్నా మల్కాజిగిరి ఎంపీ స్థానం తమదేనని తేల్చిచెప్పారు.

TS Politics:  ఆయనతో అయ్యేది లేదు.. పోయ్యేది లేదు.. మల్లారెడ్డి మాస్ కామెంట్స్

హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంట్ టికెట్‌పై మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో తమకు పొత్తు ఉన్నా మల్కాజిగిరి ఎంపీ స్థానం తమదేనని తేల్చిచెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు పొత్తు ఉంటే తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. ఆయనతో అయ్యేది లేదు... పొయ్యేది లేదని ఎద్దేవా చేశారు. మల్కాజిగిరి టికెట్ భద్రంగా ఉందన్నారు. తన అల్లుడు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరని... తమ కుటుంబం వేరని చెప్పారు. తన కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. తమ యూనివర్సిటీల్లో అక్రమ కట్టడాలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే తాను ఏం చేయలేనని మల్లారెడ్డి అన్నారు.

Updated Date - Feb 16 , 2024 | 07:19 PM