Share News

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:17 PM

ఢిల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor Case ) లో ఈ నెల 22 తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని ఈడీ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రా పిళ్ళై ( Arun Ramachandra Pillai ) మధ్యంతర బెయిల్ పొడిగింపుకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసు ( Delhi Liquor Case ) లో ఈ నెల 22 తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని ఈడీ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుడు అరుణ్ రామచంద్రా పిళ్ళై ( Arun Ramachandra Pillai ) మధ్యంతర బెయిల్ పొడిగింపునకు ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది. ఈ నెల 20వ తేదీ లోపు పిళ్ళై లొంగిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. భార్య అనారోగ్యంతో మధ్యంతర బెయిల్‌ను అరుణ్ రామచంద్రన్ పిళ్ళై పొందారు.

అరుణ్ రామచంద్రన్ పిళ్ళై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీ అని ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈడీ విచారణకు కవితని పిలిచిన హాజరుకాలేదు. సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణకు తాను హాజరు కాలేనని కవిత సమాధానం ఇచ్చారు. మరోవైపు లిక్కర్ కేసులో గురువారం తమ ముందు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నాలుగో సారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చారు. రేపు కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు అవుతారా లేదా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రేపు కూడా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోతే తాము సీరియస్‌గా తీసుకుంటామని ఈడీ అధికారులు హెచ్చరించారు.

Updated Date - Jan 17 , 2024 | 06:29 PM