Share News

Telangana: ఇంత మోసమా? కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్..

ABN , Publish Date - May 21 , 2024 | 10:07 AM

వరిపంటకు బోనస్(Paddy Bonus) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Government) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇది ప్రజా పాలన కాదని.. రైతు వ్యతిరేక పాలన అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Telangana: ఇంత మోసమా? కాంగ్రెస్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్..
KTR

హైదరాబాద్, మే 21: వరిపంటకు బోనస్(Paddy Bonus) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Government) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం నాడు ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇది ప్రజా పాలన కాదని.. రైతు వ్యతిరేక పాలన అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


కేసీఆర్ పోస్ట్ సారాంశం..

‘ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన.. గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ?? ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా ?? ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే..రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు.’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేటీఆర్.


‘ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం. అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ సర్కారు. ఎద్దేడ్సిన యవుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే.. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ..’ అని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 21 , 2024 | 10:07 AM