Share News

KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:07 PM

Telangana: కరీంనగర్‌లో జరిగే బీఆర్‌ఎస్ ‘‘కదన భేరి’’ సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూరంగా ఉండనున్నారు. గత రెండు రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈరోజు (మంగళవారం) జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో మాజీ మంత్రి చికిత్స తీసుకుంటున్నారు.

KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!

హైదరాబాద్, మార్చి 12: కరీంనగర్‌లో జరిగే బీఆర్‌ఎస్ (BRS) ‘‘కదన భేరి’’ సభకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) దూరంగా ఉండనున్నారు. గత రెండు రోజులుగా కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఈరోజు (మంగళవారం) జరగనున్న కరీంనగర్ సభకు (Karimnagar Sabha) హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో మాజీ మంత్రి చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

కాగా.. ఈరోజు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో బీఆర్ఎస్ కదన భేరి సభ జరుగనుంది. లక్ష మందితో సభకు అధినేత కేసీఆర్ (BRS Chief KCR) సన్నాహాలు చేస్తున్నారు. కరీంనగర్ సభ నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేసీఆర్ సమీక్షలు చేస్తున్నారు. వరుసగా పార్టీని వీడుతున్న నేతలు, పోటీకి నాయకుల ఆసక్తి చూపకపోవడంతో బీఆర్‌ఎస్ ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేసీఆర్ కరీంనగర్ సభతో కేడర్‌లో భరోసా నింపి ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి...

Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ మీటింగ్.. నిర్ణయాలపై ఉత్కంఠ

Chennai: లోక్‌సభ ఎన్నికలకు జోరుగా ప్రచార వాహనాల తయారీ..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 01:17 PM