Share News

Jagga Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి గేమ్ మొదలెట్టారు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

ABN , Publish Date - Feb 23 , 2024 | 10:15 PM

కేంద్రంలో ఏం జరుగుతుందో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి‌కే క్లారిటీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. కిషన్ రెడ్డి ఢిల్లీలో ఒకలాగా.. ఇక్కడ ఇంకోలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమ్మక్క - సారలక్కలనే బీజేపీ నేతలు మోసం చేశారని.. తెలంగాణ ప్రజలను మోసం చేయటం పెద్ద పనా? అని ప్రశ్నించారు.

Jagga Reddy: బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి గేమ్ మొదలెట్టారు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్: కేంద్రంలో ఏం జరుగుతుందో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి‌కే క్లారిటీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. కిషన్ రెడ్డి ఢిల్లీలో ఒకలాగా.. ఇక్కడ ఇంకోలాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమ్మక్క - సారలక్కలనే బీజేపీ నేతలు మోసం చేశారని.. తెలంగాణ ప్రజలను మోసం చేయటం పెద్ద పనా? అని ప్రశ్నించారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోతే ఎంపీ బండి సంజయ్ సమాధానం చెప్పలేడు కాబట్టి ఆయన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టారని ఆరోపించారు. మళ్లీ కవితకు ఇచ్చే నోటీస్ గురించి కిషన్ రెడ్డికి ఏం తెలిసి ఉండదన్నారు. మళ్లీ ఢిల్లీ నుంచి గేమ్ మొదలు పెడతారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కవిత కొత్త సీరియల్ స్టార్ట్ అయిందని దెప్పిపొడిచారు. కాంగ్రెస్‌కి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే 14 ఎంపీ సీట్లుకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గండి కొట్టేందుకు కుట్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కి 14 సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. గ్యాస్ , పెట్రోల్ ధరల మీద కిషన్ రెడ్డి ఎందుకు పార్లమెంట్‌లో చర్చించరని ప్రశ్నించారు.

మేడారంపై మాట తప్పారు

బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై లేని పోని ఆరోపణలు చేసి బద్నాం చేసే పనిలో ఉన్నారని ధ్వజమెత్తారు. గ్యాస్, కరెంట్ మీద సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ప్రకటన చేశారని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని బీజేపీ నేతలు అర్జున్ ముండా, కిషన్ రెడ్డి రెండేళ్ల క్రితం ప్రకటించి మాట తప్పారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి సమ్మక్క- సారలక్క అమ్మవార్లకు మొక్కుతారు కాబట్టే ... జాతీయ పండగగా ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసిందని అన్నారు. ఇద్దరు కేంద్రమంత్రుల మాటలకు భక్తులే సాక్ష్యమని చెప్పారు. బీజేపీ నేతలు తెలగాణ ప్రజలను10 ఏళ్లుగా మోసం చేస్తునే ఉన్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్14 సీట్లు గెలుస్తుందని.. కనీసం బీజేపీ 3 సీట్లు కూడా దక్కించుకోలేక పోతే ఆ పార్టీ ఉనికి కోల్పోతుందని అన్నారు. కాంగ్రెస్ మీద బురదజల్లే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల కంటే ముందు ఈడీ కవితను అరెస్ట్ చేస్తుందని బండి సంజయ్ చెబుతున్నాడని అంటున్నారని.. ఆ మాట మీద ఆయన నిలబడతారా అని జగ్గారెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - Feb 23 , 2024 | 10:15 PM