Share News

TS News: ఈ బ్యాంక్ మేనేజర్లు మామూలోళ్లు కాదుగా..

ABN , Publish Date - Mar 09 , 2024 | 02:16 PM

Telangana: అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు ఆ బ్యాంకు మేనేజర్లు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మేనేజర్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

TS News: ఈ బ్యాంక్ మేనేజర్లు మామూలోళ్లు కాదుగా..

హైదరాబాద్, మార్చి 9: అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు ఆ బ్యాంకు మేనేజర్లు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతూ దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ (SBI Bank) బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. కోట్లు కొల్లగొట్టిన బ్యాంకు మేనేజర్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్య ఖాతాదారులకు తెలియకుండా రూ.2.80 కోట్లను కాజేశారు. లోన్ అప్లై చేసిన ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకున్న సదరు మేనేజర్లు.. ఫామ్ 16ను ఫోర్జరీ చేసి తప్పుడు స్టేట్‌మెంట్లతో లోన్లు తీసుకున్నారు. ఆ వచ్చిన లోన్ అమౌంట్‌ను భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో దాదాపు 19 మంది పేర్లపై మేనేజర్లు లోన్లు తీసుకున్నారు. అయితే కొత్త మేనేజర్ రావడంతో వీరి బండారం బయటపడింది. బ్యాంకులో జరిగిన మోసాన్ని గుర్తించిన కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్యపై పోలీస్ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం.. షేక్ సైదులు, భార్య సుష్మ, కొడుకు పీరయ్య, మరో మేనేజర్ గంగమల్లయ్య పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి...

Kunamneni Sambasivarao: వయనాడ్‌ నుంచి రాహుల్ పోటీ సరైంది కాదు

Hyderabad: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిల అక్రమాలను బయటపెడతాం..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 09 , 2024 | 02:16 PM