Share News

KTR: కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదు..!

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:42 PM

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

KTR: కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదు..!

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీల పుస్తకంను బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా చదవి, అవి అమలు చేసేంత వరకు వదలొద్దు అని కార్యకర్తలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఒక్క నెలలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నజనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిగతా 6 నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

"ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపులు సహజం. ఈరోజు మనం ఒడిపోయాము అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్నికరపత్రంలా మాట్లాడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్లోరైడ్ సమస్య తీర్చింది నిజం కాదా!. ఇంటింటికీ మంచి నీళ్ళు ఇచ్చింది నిజం కాదా!.. పదేండ్లల్లో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే, కళ్ళు లేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యహారిస్తుంది. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది, కేసీఆర్ ప్రజాశేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని" కేటీఆర్ అన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 01:57 PM