Share News

Phone Tapping: ఆ ప్రచారం అంతా ఉత్తిదే.. ఫోన్ ట్యాపింగ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 01:18 PM

Telangana: బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గెస్ట్‌హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్.. పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Phone Tapping: ఆ ప్రచారం అంతా ఉత్తిదే.. ఫోన్ ట్యాపింగ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, ఏప్రిల్ 8: బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ (BRS MLC Naveen kumar) గెస్ట్‌హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping).. పోలీసు అధికారుల భేటీలు జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా గెస్ట్ హౌస్‌లో ఎలాంటి తనిఖీలు జరగలేదు. సోషల్ మీడియాలో వస్తున్నది తప్పు. నా గెస్ట్ హౌస్‌లో, నా ఇంట్లో ఎలాంటి పోలీస్ తనిఖీలు జరగలేదు. కుట్ర పూరితంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నాం’’ అని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

Phone Tapping: పోలీసుల దర్యాప్తు వేగవంతం.. ఎన్నిచోట్ల ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారంటే?


ప్రచారం ఇదే...

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గెస్ట్ హౌస్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. నవీన్ గెస్ట్ హౌస్ అడ్డాగా ఫోన్ ట్యాపింగ్.. పోలీసు అధికారుల భేటీలు జరిగాయని.. ప్రతిపక్ష పార్టీల నేతల టార్గెట్ స్కెచ్ గీసినట్లు సమాచారం. ఈ కేసులో అరెస్ట్‌ అయిన ప్రణీత్ రావు, భుజం గరావు, తిరుపతన్న, రాధాకిషన్‌ రావుతో గెస్ట్ హౌస్‌పై స్టేట్మెంట్లు రికార్డు చేశారని.. గెస్ట్ హౌస్‌లో భుజంగరావు కీలక వ్యవహారాలు నడిపినట్లు విచారణలో బయటపడినట్లుగా వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.


ఇవి కూడా చదవండి...

Solar Eclipse 2024: నేటి సూర్యగ్రహణం ఎందుకంత అరుదైనది?.. దీని వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Big Breaking: హెరిటేజ్ డాక్యుమెంట్స్ తగులబెట్టిన సిట్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 01:19 PM