Laxman: కాంగ్రెస్ - బీఆర్‌ఎస్‌ది టామ్ అండ్ జెర్రీ కొట్లాట
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:05 PM
Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు టామ్ అండ్ జర్రీలా నాటకీయంగా కొట్లాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ. నరేంద్రమోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ 10 ఏండ్ల పాలన అభివృద్ధిపై చర్చ లేకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం, ధరణి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లాంటి పతాక శీర్షికలో వచ్చేలా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్, ఏప్రిల్ 3: కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు టామ్ అండ్ జర్రీలా నాటకీయంగా కొట్లాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ (BJP MP Laxman) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీకి (PM Modi)పెరుగుతున్న ఆదరణ చూసి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నరేంద్రమోదీ 10 ఏండ్ల పాలన అభివృద్ధిపై చర్చ లేకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం, ధరణి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లాంటి పతాక శీర్షికలో వచ్చేలా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014 నుంచి 2023 వరకు ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నాయకులు ఫోన్స్ ట్యాప్ చేయడం రిటైర్ పోలీస్ అధికారి చేసినవన్నారు. దేశ భద్రత, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశం ఇది అని పేర్కొన్నారు. 2018, 2019 జరిగిన ఎన్నికలు దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బయటకు వస్తున్నాయన్నారు.
ఈ వార్తలు బయటకు వస్తుంటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు. అధికార పార్టీకి చెందిన డబ్బులను పోలీసు వాహనాలలో సరఫరా చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దీనిని సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టే వెంటనే సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అంశం కావున కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఆశ్చర్యకరమైన, జుగుప్సకరమైన వార్తలు బయటకు వస్తున్నాయన్నారు. కేటీఆర్.. హిందుగాలు బొందుగాలు అన్నదానికి కరీంనగర్ ప్రజలు మొన్న తీర్పు చెప్పారన్నారు. జై శ్రీరామ్ అనడం ఎవరి నమ్మకం వారిది.. జై శ్రీరామ్ అనడం తప్పని చెప్పండి అప్పుడు ప్రజలు చూసుకుంటారని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR: కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు..
AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...