Share News

AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:38 PM

ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వాఖ్యానించారు. వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

AP High Court: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారుకు హైకోర్టులో ఊహించని షాక్

అమరావతి: ఎన్నికలకు ముందుకు ఏపీ సర్కారు (AP Government)కు హైకోర్టులో ఊహించని షాక్ తగలింది. ఏపీలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీని నిలువరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. వలంటీర్లు వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని వాఖ్యానించారు. వలంటీర్లపై వచ్చిన ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది. ఈసీఐ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళలేని వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్ళి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. సజావుగా పెన్షన్ల పంపిణీకి ఈసీఐ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిల్‌ను కొట్టివెస్తున్నట్లు ప్రకటించింది.

AP Pensions: మధ్యాహ్నం 3 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ: చిత్తూరు కలెక్టర్

వలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పెన్షన్‌ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు వెల్లడించారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్‌, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు.

YSRCP: వాలంటీర్ల రాజీనామాలు అంతా వైసీపీ కుట్రలో భాగమేనా?

హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు వలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్‌ చేయించాలని ఈసీ ఆదేశించినట్లు మీనా తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను, నగదు పంపి ణీ పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని ఈసీ సూచించినట్లు ముఖేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. దీనిపై వైసీపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా ఈసీఐ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిల్‌ను కొట్టివెస్తున్నట్లు ప్రకటించింది.

AP Elections: పెద్ద ఎత్తన చీరల బండిల్స్ పట్టివేత.. ఇందంతా ఓటర్ల కోసమేనా!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 03 , 2024 | 12:51 PM