Share News

AP Pensions: మధ్యాహ్నం 3 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ: చిత్తూరు కలెక్టర్

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:13 PM

Andhrapradesh: గ్రామ సచివాలయం వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వృద్ధాప్య వితంతు పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పారదర్శకంగా పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయంలో పెన్షన్లను అందజేయనున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సామాజిక మధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు.

AP Pensions: మధ్యాహ్నం 3 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ: చిత్తూరు కలెక్టర్

చిత్తూరు, ఏప్రిల్ 3: గ్రామ సచివాలయం వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వృద్ధాప్య, వితంతు పెన్షన్లను (AP Pensions) పంపిణీ చేయనున్నట్లు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పారదర్శకంగా పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సచివాలయంలో పెన్షన్లను అందజేయనున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సామాజిక మధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని కోరారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి పెన్షన్లను పంపిణీ చేస్తామని ఆందోళన చెందవద్దని అభయమిచ్చారు. సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. టోల్ ఫ్రీ- 6300433367ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Kejriwal : ఒక్కసారిగా 4.5 కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. టెన్షన్‌లో ఆప్!


కాగా.. ఈరోజు నుంచి 4 రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి, వితంతువులకు ఇంటివద్దే పింఛను సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఈరోజు నుంచి పెన్షన్ల పంపిణీ ఉంటుందని ప్రకటించడంతో వృద్ధులు, వితంతువులు ఉదయాన్నే సచివాలయాలకు చేరుకున్నారు. అయితే పలు చోట్ల సచివాలయాలు ఇంకా తెరుచుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు అందలేదని మధ్యాహ్నం తరువాత రావాలని పలు చోట్ల సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తీవ్ర నిరాశతో వృద్ధులు, వితంతువులు వెనుతిరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం

Realme: దేశంలోనే చౌకైన 5 జీ స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన రియల్ మి.. ధర, ఫీచర్లివే

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 03 , 2024 | 12:22 PM