Share News

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:55 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రేటర్‌ బీఆర్‌ఎస్(BRS)లో అత్యంత గందరగోళం నెలకొన్నది. అధిష్ఠానమే మాకు ఫైనల్‌ అని మొన్నటి వరకు బీరాలు పలికిన వారు నేడు ‘కారు’ దిగి హస్తం పార్టీలో చేరిపోతున్నారు.

Hyderabad: ‘అయ్యో’మయం.. ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‏లో గందరగోళం

- కాంగ్రెస్‏లోకి మరికొందరు ఎమ్మెల్యేలు

- కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’తో అనుమానాలు

- కారులోనే ఉంటామంటూ రాత్రికిరాత్రే జంప్‌

- త్వరలో హస్తం గూటికి నగర మాజీ మంత్రి ?

హైదరాబాద్‌ సిటీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రేటర్‌ బీఆర్‌ఎస్(BRS)లో అత్యంత గందరగోళం నెలకొన్నది. అధిష్ఠానమే మాకు ఫైనల్‌ అని మొన్నటి వరకు బీరాలు పలికిన వారు నేడు ‘కారు’ దిగి హస్తం పార్టీలో చేరిపోతున్నారు. అధికార కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరతీయడంతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు గులాబీ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌(Khairatabad MLA Dana Nagender) కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవడంతో ‘కారు’లో ఎవరుంటారో? ఎవరు దిగుతారో? అన్న అయోమయం నెలకొన్నది.

రోజుకో పేరు తెరపైకి..

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ త్వరలో కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ముందే స్పందించిన నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు కాలేరును పార్టీలోకి తీసుకోవద్దని రాష్ట్ర నేతలను గట్టిగా డిమాండ్‌ చేశారు. ఆయన కాంగ్రెస్ లోకి రావాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని పట్టుబడుతున్నారు. ఆయనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, ఓ మాజీ మంత్రి కూడా బీఆర్‌ఎస్‌ను వీడుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

city2.jpg

బలోపేతమే కాంగ్రెస్‌ లక్ష్యం

గ్రేటర్‌లో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం లేదు. మొత్తం 24 స్థానాలుండగా బీఆర్‌ఎస్‌-16, ఎంఐఎం-7, బీజేపీ-1 విజయం సాధించాయి. దీంతో మహా నగరంలో బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరలేపింది. పార్టీ మారుతారంటూ నగరానికి చెందిన పలువురు గులాబీ శాసనసభ్యుల పేర్లూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మేం బీఆర్‌ఎస్‏ను వీడేది లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నా..ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తన పూర్వాశ్రమం కాంగ్రెస్‏లో తిరిగి చేరుతారని ప్రచారం జరుగతున్న వేళ.. నియోజకవర్గ హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా అంబర్‌పేటలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాదయాత్ర నిర్వహించడం గమనార్హం. ఈసమయంలో పార్టీ మారుతారని ప్రచారం జరగడంతో దీంతో పార్టీలో ఉంటారా? వెళ్తారా? అని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన వేళ ఇలాంటి పరిస్థితి ప్రభావం చూపుతుందని సీనియర్‌ నేతలు అభిప్రాయ పడుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: భానుడి భగభగలు.. గ్రేటర్‌ పరిధిలో 41-42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు

Updated Date - Apr 03 , 2024 | 11:55 AM