Share News

TS Politics: బీఆర్‌ఎస్‌తో కలిసి సీఎం రేవంత్‌ సొంత దుకాణం.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Apr 10 , 2024 | 03:00 PM

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌తో చేతులు కలుపుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

TS Politics: బీఆర్‌ఎస్‌తో కలిసి సీఎం రేవంత్‌ సొంత దుకాణం.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
BJP Leader Eleti Maheshwar reddy

హైదరాబాద్, ఏప్రిల్ 10: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (BJP Leader Eleti Maheshwar Reddy) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో (Congress MLAs) రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌తో (BRS) చేతులు కలుపుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్‌తో కలసి సొంత దుకాణం పెట్టుకోవటానికి రేవంత్ రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

AP Politics: సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాణి అల్లుడు ఆగడాలు: మాజీమంత్రి సోమిరెడ్డి


ఉత్తమ్, పొంగులేటి కూడా పది మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారన్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ సీటు ఓడిపోతున్నామని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. సొంత పార్టీ వాళ్ళ వలన రేవంత్ అభద్రతా భావంలో ఉన్నారన్నారు. గేట్లు ఓపెన్ చేసినా.. పట్టుమని పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చులోకపోయారని ఎద్దేవా చేశారు. బై ఎలక్షన్ అంటూ వస్తే.. ప్రజలు బీజేపీ వైపే ఉంటారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12ఎంపీ‌ సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.


భట్టి విక్రమార్కను సైడ్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. పీసీసీ పదవి కోసం పది మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారన్నారు. భట్టి 9 శాతం బీ టాక్స్ లీక్ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారని తెలిపారు. భట్టిని పక్కన పెట్టి సెకెండ్ పొజిషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రెండో స్థానంలోకి వస్తే.. తర్వాత మెదటి స్థానం కోసం ప్రయత్నాలు జరుగుతాయన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డికి దగ్గర చాలా పోలికలున్నాయంటూ దుబయ్యబట్టారు. కాంగ్రెస్‌లో ఎల్లో, పింక్, గాంధీ కాంగ్రెస్ ఉన్నాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి‌ లేదని ఏలేటి మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

KTR-Samantha: కేటీఆర్ ఫోటో.. సమంత కామెంట్.. ఏం జరిగిందంటే..!

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 10 , 2024 | 03:22 PM