Share News

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

ABN , Publish Date - Apr 10 , 2024 | 01:36 PM

Telangana: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ ఇంటరాగేషన్‌ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అరెన్యూ కోర్టులో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది.

Delhi liquor Scam: కవితను సీబీఐ ప్రశ్నించడంపై విచారణ ఈనెల 26కు వాయిదా..

న్యూఢిల్లీ, ఏప్రిల్10: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ (CBI) ఇంటరాగేషన్‌ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు తప్పుబట్టారు. సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో (Delhi Rouse Avenue Court) కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు (బుధవారం) కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై ఈనెల 26న సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగనుంది. ఇప్పటికే కోర్టులో వాదనల సందర్భంగా కవితను తీహార్ జైల్లో విచారించామని కోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే పిటిషన్‌పై రిప్లై కాపీ ఇవ్వలేదు. దీనిపై రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని సీబీఐ తెలిపింది.

AP Election 2024: వైసీపీలో చేరిన పోతిన మహేశ్


అటు కవిత తరపున రాణా, మోహిత్ రావు వాదనలు వినిపించారు. సీబీఐ తమకు రిప్లై కాపీ ఇవ్వలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణపై శనివారం సాయంత్రం 5:30 గంటలకు ఆర్డర్ వచ్చిందని తెలిపారు. అయితే కవితను 6వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకే సీబీఐ విచారించిందని చెప్పారు. ఆర్డర్ రాకుండానే సీబీఐ విచారణ జరిపిందని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ముందుగా విచారించాలంటే మరోసారి అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుందని జడ్జి సూచించారు. దీంతో 26వ తేదీన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ చెప్పింది. ఈ క్రమంలో ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

KTR-Samantha: కేటీఆర్ ఫోటో.. సమంత కామెంట్.. ఏం చేసిందంటే..!

YS Sharmila: ఇలానే ఉంటుందా రాజన్న పాలనా?... అధికార పార్టీ సిగ్గుపడాలి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 10 , 2024 | 01:37 PM