Share News

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

ABN , Publish Date - May 25 , 2024 | 01:16 PM

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

బెంగళూరు/హైదరాబాద్: బెంగళూరు రేవ్‌ పార్టీ (Rave Party) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ పోలీసులు (City Crime Branch Police) నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. రక్త నమూనాలలో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి సీసీబీ నోటీసులు జారీచేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో సీసీబీ స్పష్టంగా పేర్కొన్నది.

hemaatBengaluruRaveParty.jpg

ఇప్పుడే మొదలైంది..!

కాగా.. రేవ్‌ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్షలు చేయగా.. 86 మందికి రక్త నమూనాలలో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. ఇందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. పార్టీలో ఉన్న 30 మందిలో 27 మంది మహిళలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్ధారణ కావడం గమనార్హం. డ్రగ్స్‌ తీసుకున్న వారందరికీ సీసీబీ పోలీసులు నోటీసులు పంపుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారందరికీ విడతల వారీగా నోటీసులు ఇవ్వడం జరుగుతోంది. తొలి విడతలో 8 మందికి బెంగళూరు సీసీబీ నోటీసులు జారీ చేసింది.

Bengaluru-Rave-Party.jpg

హేమ.. కృష్ణవేణిగా మారి!

రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో నటి హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసుతో పాటు పలువురు ఉన్నారు. అబ్బే.. తాను రేవ్ పార్టీలోకి పోలేదని హైదరాబాద్‌ ఫామ్‌హౌస్‌లోని ఓ వీడియో.. ఆ మరుసటి రోజు పచ్చడి చేస్తున్నట్లు మరో వీడియో రిలీజ్ చేసింది హేమ. హేమ ఫొటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయడం సీన్ మొత్తం రివర్సయ్యింది. కృష్ణవేణి పేరుతో నటి హేమ పార్టీకి హాజరైంది. పోలీసు రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేయడం జరిగింది. అయితే.. హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Rave Party: డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్!


Updated Date - May 25 , 2024 | 02:32 PM