Share News

Bandi Sanjay: నయీముద్దీన్ కేసును తవ్వితే ఆ నేతల బండారం భయటపడుతోంది

ABN , Publish Date - Jan 08 , 2024 | 07:12 PM

అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) అన్నారు. సోమవారం నాడు బీజేపీ ( BJP ) ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) చెప్పాలని బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay: నయీముద్దీన్ కేసును తవ్వితే ఆ నేతల బండారం భయటపడుతోంది

హైదరాబాద్: అప్పుల పేరుతో కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) అన్నారు. సోమవారం నాడు బీజేపీ ( BJP ) ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) చెప్పాలి. వందరోజుల్లో ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలి. కొత్త ప్రభుత్వమని కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేయొద్దు. ప్లాన్ వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలి. అప్పు తీర్చేందుకు ప్లాన్ చెబితే పెట్టుబడులు వస్తాయి. డ్రగ్స్ కేసు తిరగదోడాలి.. ఎంత పెద్దవాళ్లు ఉన్నా బయటకు లాగాలి. కేసీఆర్ డ్రగ్స్ కేసు విషయం మాట్లాడినప్పుడు రాష్ట్రం అంతా ఊడికిపోయింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి. ఈ కేసులు మూసివేసింది ఎవరో బయటపెట్టాలి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు నీరు గార్చింది ఎవరు..? 317జీవో సవరిస్తారా లేదా చెప్పాలి’’ ’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.


ఈటల రాజేందర్ అందుకే పార్టీలో ఉంటున్నారు

గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ( Gangster Naeemuddin ) ఎన్‌కౌంటర్ తర్వాత భారీగా డబ్బు బయటపడింది అన్నారు. నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎటు పోయాయి. ఈ కేసును తవ్వితే చాలా పార్టీల్లోని నేతల బండారం బయటపడుతుంది. నయీం కేసు ఆస్థులు బయటకు వస్తే రెండు మూడు జిల్లాలు బాగుపడతాయి. కాంగ్రెస్ కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని కోరారు. సీబీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటి? సీబీఐ విచారణ చేయించమని కిషన్‌రెడ్డి మాట్లాడితే గుంటనక్కల తరహాలో దాడి చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే.. సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే తెలంగాణ నుంచి అత్యధిక బీజేపీ ఎంపీలను గెలిపించాలి. మోదీని అడిగి మేము అధిక నిధులు తెప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇవి ఢిల్లీ ఎన్నికలు... ఈ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) పార్టీని నమ్మి బీజేపీలో కొనసాగుతున్నారు. ఎంతోమంది వెళ్లిపోయారు... కానీ ఈటల ఇక్కడే ఉన్నారు’’ అని బండి సంజయ్ తెలిపారు.


తెలంగాణ పేరుని తొలగించిన మూర్ఖులు

‘‘బీఆర్ఎస్ ( BRS ) బీజేపీ ఒక్కటే ఎలా అవుతుందో చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం ఇది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు పది సీట్లు తగ్గితే వారు సహకరించుకునే వారు. పార్టీలోకి స్వలాభం కోసం వచ్చే వారిని స్వాగతించం. పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉండే వారికి సహకరిస్తాం. బీఆర్ఎస్‌కు ఓటేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. పార్టీ పేరులో తెలంగాణ పేరు తొలగించిన మూర్ఖులు వీరు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నా ... జాతీయ పార్టీనా స్పష్టం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో ఓటేసినట్టే.బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది టచ్‌లో ఉన్నారు. ఈ ఎన్నికలు మోదీ ఎన్నికలనీ ఎవరిని అడిగినా చెబుతారు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 07:12 PM