Share News

Harish Rao: ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? దాడిని ఖండిస్తున్నాం

ABN , Publish Date - May 20 , 2024 | 01:59 PM

రేవంత్ రెడ్డి పాలన లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూటా మాటలులా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను ఆయన పరామర్శించారు. రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రను పరామర్శించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు.

Harish Rao: ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? దాడిని ఖండిస్తున్నాం

నల్గొండ : రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలన లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూటా మాటలులా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌ను ఆయన పరామర్శించారు. రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రను పరామర్శించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు. దాడిని బీఆర్ఎస్ ఖండిస్తోందన్నారు.100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేమంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి చేతులెత్తేశారని హరీశ్ రావు తెలిపారు.

AP Elections 2024: మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన గెలుస్తారా..!?


ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్ట భద్రులు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు తెలిపారు. తూకంలో కోతలు, ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్నారన్నారు. సన్నాళ్లకే బోనస్ ఇస్తామన్నారని.. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఈ మాట అంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందన్నారు. ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయగానే కరెంట్ పోయిందని.. కరెంట్ తాను తెప్పించినాని రేవంత్ అంటాడని.. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోయిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి...

KTR: అది మా తప్పేనంటూ ఒప్పుకున్న కేటీఆర్

Viral News: పిల్లికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అవార్డు.. దాని వెనుకున్న ఆసక్తికర కారణం ఏంటంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 02:00 PM