Share News

Siddipet: రేవంత్‌ రెడ్డి ఉద్యమ ద్రోహి..

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:26 AM

రేవంత్‌ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, ఆయన ఎంత పెద్ద పదవులు అనుభవించినా ఉద్యమకారుడు మాత్రం కాలేడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా రేవంత్‌ చరిత్రలో మిగిలిపోతాడని ఆయన పేర్కొన్నారు.

Siddipet: రేవంత్‌ రెడ్డి ఉద్యమ ద్రోహి..

  • ఆయన ఎన్నడూ ఉద్యమకారుడు కాలేడు: హరీశ్‌రావు

సిద్దిపేట అర్బన్‌/ మర్కుక్‌, జూన్‌ 3: రేవంత్‌ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, ఆయన ఎంత పెద్ద పదవులు అనుభవించినా ఉద్యమకారుడు మాత్రం కాలేడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ద్రోహిగా రేవంత్‌ చరిత్రలో మిగిలిపోతాడని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులమన్న ఘనత తమకు మాత్రమే దక్కుతుందని కరెంటు కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేశామని గుర్తు చేశారు.


సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ సిద్ధించేది కాదని అన్నారు. ఆనాడు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారని, ఇప్పుడు రేవంత్‌ పాలనలో ఆ పదమే మాయమైపోయిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కలను నిజం చేసిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు మర్చిపోరని హరీశ్‌ స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు. కాగా, సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా హరీశ్‌రావు మాజీ సీఎం కేసీఆర్‌ను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 04:26 AM