Share News

Harish Rao: బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:16 PM

మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ కేంద్ర హై కమాండ్‌ది ఒక దారి... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది మరో దారిలా ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నాడు ఓ పత్రికా ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao: బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ కేంద్ర హై కమాండ్‌ది ఒక దారి... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది మరో దారిలా ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నాడు ఓ పత్రికా ప్రకటనలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి కనిపించడం లేదని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల నాయకత్వంలో కాకుండా... ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీకి అనుకూలంగా సీఎం రేవంత్ పని చేస్తున్నారని స్పష్టం అవుతోందని చెప్పారు.

మోదీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో వేధింపులకు పాల్పడుతోందన్న తమ వాదనను ఏఐసీసీ బలపరిచిందని తెలిపారు. లిక్కర్ స్కామ్ పూర్తిగా కల్పితమని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారని.. రేవంత్ రెడ్డి మాత్రం ఏఐసీసీ పెద్దలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కి సంబంధించిన నేతగా మాట్లాడటం లేదని.. ఆర్ఎస్ఎస్ భావజాలం నిండిన మోదీ అనుచరుడిగా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 10:16 PM