Share News

Etala Rajender: రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప నిధులు లేవు..

ABN , Publish Date - May 01 , 2024 | 12:17 PM

రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప.. సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని, లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్‌రెడ్డి ఎన్నో మీటింగుల్లో గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌(Etala Rajender) గుర్తు చేశారు.

Etala Rajender: రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప నిధులు లేవు..

- బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప.. సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని, లంకెబిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ ఖజానా కనిపిస్తోందని రేవంత్‌రెడ్డి ఎన్నో మీటింగుల్లో గోడు వెళ్లబోసుకున్నది నిజం కాదా అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌(Etala Rajender) గుర్తు చేశారు. బుధవారం బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో హస్మత్‌పేట్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు సంఘాల నాయకులు, కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తనకు తెలుసని, తనను ఎంపీగా గెలిపిస్తే సమస్యలను నేరుగా మోదీకి విశదీకరించే చనువు తనకు ఉందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీలు గుప్పించి వారి ఓట్లను దండుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మరిచిపోయిందని ఆరోపించారు. మద్యం నుంచి వచ్చే ఆదాయం తప్పా రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఆదాయం మార్గం లేదన్నారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన హామీలను నెరవేర్చలేదని అర్థమవుతోందన్నారు.

ఇదికూడా చదవండి: BRS: బీఆర్‌ఎస్‏కు గుర్తుల గుబులు..! రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం

- మరోసారి బీజేపీని గెలిపించండి

కూకట్‌పల్లి: దేశ ప్రజల విశ్వాసం, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే బీజేపీకి మరోసారి అధికారం అందించేలా ప్రజలు సహకరించాలని ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేపీహెచ్‌బీ టెంపుల్‌ బస్టాప్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఈటల మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, గడిచిన నాలుగు నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా ఏ హామీనీ నెరవేర్చలేకపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు 2,500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇవ్వలేకపోయారని ఈటల పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమంతో దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారన్నారు. అంతకు ముందు ఎల్బీ నగర్‌లో కార్యక్రమాలు పూర్తి చేసుకుని మెట్రోరైల్లో కేపీహెచ్‌బీ వరకూ ప్రయాణించారు. కార్యక్రమంలో నియోజకవ్గ ఇన్‌చార్జి మాధవరం కాంతారావు, కన్వీనర్‌ శ్రీకర్‌రావు, కార్పొరేటర్‌ మహేందర్‌, నాయకులు యంజాల పద్మయ్య, వడ్డేపల్లి రాజేశ్వర రావు, ప్రితంరెడ్డి, సందీప్ మిశ్రా, సురేందర్‌రెడ్డి, షాజహాన్‌, విశ్వేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బాలాపూర్‌లో సీఎం సభ గ్రాండ్‌ సక్సెస్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 12:17 PM