Share News

TG Politics: ఎలక్టోరల్ బాండ్లపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 15 , 2024 | 04:25 PM

రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే ఎలక్టోరల్ బాండ్లను మోదీ సర్కార్ (Modi Govt) తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. SBI బ్యాంకు అధికారుల వెనుక కేంద్రపెద్దలున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు.

TG Politics: ఎలక్టోరల్ బాండ్లపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే ఎలక్టోరల్ బాండ్లను మోదీ సర్కార్ (Modi Govt) తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. SBI బ్యాంకు అధికారుల వెనుక కేంద్రపెద్దలున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో బాధ్యతవహించాలని డిమాండ్ చేశారు. క్విడ్ ప్రో కోకు లాభపడిన అందరి వివరాలు బయటకు రావాలని అన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలక్టోరల్ బాండ్లను మొదటి నుంచి తాము వ్యతిరేకించామని చెప్పారు. ఈ బాండ్ల వ్యవహారంలో SBI బ్యాంకు వ్యవహారశైలి సరిగా లేదని అన్నారు.

SBI దగ్గర వివరాలు అందించే టెక్నాలజీ లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు సమయం లేదని దొంగలను కాపాడేందుకే SBI బ్యాంకు వివరాలను ఇవ్వట్లేదని చెప్పారు. ఏ పార్టీకి బాండ్ల సమాచారం ఇచ్చారో చెప్పలేదన్నారు. ఎవరెవరికి, ఏఏ పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని అన్నారు. కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన లెక్కలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ బాండ్లపై పారదర్శకత ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. దొంగలను, రాజకీయ పార్టీలను కాపాడేందుకు SBI బ్యాంకు చేసే ప్రయత్నం సరికాదన్నారు. లెక్కలు ఇవ్వని అధికారులను విచారణ చేసి జైల్లో పెట్టాలని సీపీఐ నారాయణ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

TG Politics: సీఎం రేవంత్ అందులో పోటీ పడుతున్నారు: హరీశ్‌రావు

Big Breaking: ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఝలక్..

MP Arvind: ఆ విషయంలో హిందువులను విస్మరించిన కాంగ్రెస్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2024 | 04:25 PM