Share News

Kohli: హైదరాబాద్‌లో అందుబాటులోకి కోహ్లి రెస్టారెంట్‌

ABN , Publish Date - May 24 , 2024 | 08:50 PM

టీమిండియా క్రికెటర్, కింగ్ కోహ్లి పలు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు. సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. క్రికెట్ ఆడుతూనే బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కోహ్లి వాటా ఉన్న వన్ 8 రెస్టారెంట్లు దేశంలో పలు నగరాల్లో ఉన్నాయి. బెంగళూర్, ముంబై, పుణె, కోల్ కతా, ఢిల్లీలో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది.

Kohli: హైదరాబాద్‌లో అందుబాటులోకి కోహ్లి రెస్టారెంట్‌
Virat Kohli

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్, కింగ్ కోహ్లి (Kohli) పలు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు. సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. క్రికెట్ ఆడుతూనే బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కోహ్లి వాటా ఉన్న వన్ 8 రెస్టారెంట్లు దేశంలో పలు నగరాల్లో ఉన్నాయి. బెంగళూర్, ముంబై, పుణె, కోల్ కతా, ఢిల్లీలో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. ఆ విషయాన్ని కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హైటెక్ సిటీలో గల నాలెడ్జ్ సిటీ వద్ద హార్డ్ రాక్ కేఫ్ సమీపంలో కోహ్లి రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. ‘హే హైదరాబాద్.. మీకో విషయం చెప్పేందుకు చాలా ఆసక్తితో ఉన్నా. మేం హైటెక్ సిటీ మధ్యలోకి వచ్చేశాం. మీకు నాణ్యమైన ఆహారం అందించేందుకు వచ్చాం అని’ కోహ్లి ఇన్ స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ ప్రారంభోత్సవం గురించి పోస్ట్ చేశారు.

Updated Date - May 24 , 2024 | 08:50 PM