Share News

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. సోషల్ మీడియాలో భార్య సంచలన పోస్ట్

ABN , Publish Date - May 24 , 2024 | 08:17 PM

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(hardik pandya) ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అయినప్పటి నుంచి వృత్తిపరంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అది ఏంటంటే అతని భార్య నటాషా స్టాంకోవిచ్(natasa stankovic), పాండ్యాకు మధ్య వివాదాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. సోషల్ మీడియాలో భార్య సంచలన పోస్ట్
hardik pandya wife natasa stankovic remove pandya surname

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(hardik pandya) ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ అయినప్పటి నుంచి వృత్తిపరంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. అది ఏంటంటే అతని భార్య నటాషా స్టాంకోవిచ్(natasa stankovic), పాండ్యాకు మధ్య వివాదాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటివల సినీ నటి అయిన హార్దిక్ భార్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి వారి ఇంటిపేరును తొలగించింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


అంతేకాదు హార్దిక్‌తో ఉన్న అన్ని చిత్రాలను(photos) కూడా నటాషా సోషల్ మీడియా(social media) నుంచి తొలగించింది. దీంతో త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని పలువురు అంటున్నారు. అయితే వీరిద్దరికి 2020లో పెళ్లి జరిగింది. అదే సంవత్సరంలో నటాషా అగస్త్య పాండ్య అనే కొడుకుకు జన్మనిచ్చింది. మార్చి 4న నటాషా పుట్టినరోజు నాడు కూడా వారి విడిపోవడం గురించి ఊహాగానాలు వచ్చాయి. ఆ సమయంలో హార్దిక్ వైపు నుంచి ఎలాంటి పోస్ట్ రాలేదు. అదే సమయంలో సినీ నటి అగస్త్య తనతో ఉన్న ఫోటో మినహా హార్దిక్‌తో ఇటీవలి చిత్రాలన్నింటినీ సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఈ క్రమంలో ఈ కపుల్ డివోస్ ఖాయమని పలువురు చెబుతున్నారు.


నటాషా కంటే ముందు హార్దిక్ చాలా మంది నటీమణులతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని హార్దిక్(hardik pandya) ఖండించాడు. దీని తర్వాత హార్దిక్ ఒక నైట్ క్లబ్‌లో నటాషా స్టాంకోవిచ్‌ను కలిశాడు. హార్దిక్ క్రికెటర్ అని నటాషాకు అప్పుడు తెలియదు. ఈ విషయాన్ని హార్దిక్ స్వయంగా చెప్పాడు. నటాషాకు నేను ఎవరో తెలియదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ క్రమంగా దగ్గరయ్యామని వెల్లడించాడు. హార్దిక్, స్టాంకోవిచ్ చాలా పార్టీలలో కలిసి కనిపించడం ప్రారంభించారు. అయితే 2020కి ముందు వారిద్దరూ తమ బంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest Sports News and Telugu News

Updated Date - May 24 , 2024 | 08:26 PM