Share News

Pollard: ఇక చాలు, ఆపండి.. హర్దిక్ ముంబై కెప్టెన్సీ విమర్శలపై పొలార్డ్

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:22 PM

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.

Pollard: ఇక చాలు, ఆపండి.. హర్దిక్ ముంబై కెప్టెన్సీ విమర్శలపై పొలార్డ్

ఐపీఎల్ (IPL) 2024 సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఓడిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ జట్టుపై చేధించలేకపోయింది. దీంతో ముంబై జట్టు కొత్త కెప్టెన్ హర్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ఆట మీద దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అభిమానులు అయితే ఏకీపారేస్తున్నారు.

‘కెప్టెన్ అంటే జట్టును ముందుండి నడిపించడం. టీమ్‌ను గెలిపించడం కెప్టెన్ బాధ్యత. బౌలింగ్ మార్చడం, ఇష్టమొచ్చినట్టు ఫీల్డింగ్ మార్చడం కాదు. కీలకమైన సమయంలో ముందుగానే బ్యాటింగ్‌కు రావాలి. ఏడో స్థానంలో వచ్చినా సరే టీమ్‌ను గెలిపించాలి. జట్టును గెలిపించేందుకు కెప్టెన్ నిలకడగా ఆడాలి. అనవసర షాట్లు కొట్టి వెనుదిరగొద్దు అని’ రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసిన చివరి ఓవర్‌లో రోహిత్ శర్మను బౌండరీ వద్దకు వెళ్లాలని హర్దిక్ పాండ్యా సూచించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఆశ్చర్యపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ హర్దిక్ తీరును మండిపడ్డారు.

హర్దిక్ పాండ్యా కెప్టెన్సీ వివాదంపై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించారు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హర్దిక్ కెప్టెన్‌గా పనికిరాడని కొందరు విమర్శించారు. అలా ఎవరూ కామెంట్ చేయొద్దని పొలార్డ్ సూచించారు. ఫస్ట్ మ్యాచ్ గెలిచేందుకు జట్టు కష్టపడింది, హర్దిక్ కూడా జట్టు కోసం వ్యుహాలు రచించారని పొలార్ట్ అంటున్నారు. కొత్త కెప్టెన్‌‌ను పొలార్డ్ వెనకేసుకొని వచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

IPL 2024: వెనక్కి వెళ్లు.. రోహిత్ శర్మకు హర్దిక్ పాండ్యా ఆదేశాలు.. ఫ్యాన్స్ ఫైర్

Updated Date - Mar 25 , 2024 | 04:22 PM