Share News

IPL 2024: ఉత్కంఠ పోరు.. కోల్‌కతాపై ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి

ABN , Publish Date - Apr 21 , 2024 | 07:55 PM

చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్‌కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

IPL 2024: ఉత్కంఠ పోరు.. కోల్‌కతాపై ఒక్క పరుగు తేడాతో ఆర్సీబీ ఓటమి
KKR

చివరి బంతి వరకు ఉత్కంఠ నెలకొంది. ఒక పరుగు తేడాతో కోల్ కతా జట్టు విజయం సాధించింది. లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్టు ఆర్సీబీ వర్సెస్ కోల్ కతా మ్యాచ్ సాగింది. చివరలో దినేష్ కార్తీక్ ఔటవ్వడంతో ఓటమి ఖాయం అని ఆర్సీబీ అభిమానులు భావించారు. కరణ్ శర్మ రూపంలో ఆపద్బాంధవుడు దొరికాడు అనిపించింది. అతను చెలరేగి ఆడటంతో మ్యాచ్ గెలిపిస్తాడని భావించారు. స్టార్క్‌కు స్ట్రెయిట్ క్యాచ్ ఇచ్చి కరణ్ శర్మ ఔటవ్వంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. చివరి బంతికి మూడు పరుగులు కావాలి. రెండో బంతికి రనౌట్ కావడంతో కోల్ కతా జట్టు ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది. ఆర్సీబీ జట్టులో విల్ జాక్స్, పాటిదార్ హాఫ్ సెంచరీలు చేసి రాణించారు. ఆండ్రూ రస్సైల్ 3 వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ కొట్టారు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీశారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 08:27 PM