Share News

IPL 2024: వేట షురూ.. ప్రాక్టీస్‌లో సిక్సుల మీద సిక్సులు కొట్టేస్తున్న రిషబ్ పంత్

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:47 PM

టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్‌లో ఆడడానికి పంత్‌కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది.

IPL 2024: వేట షురూ.. ప్రాక్టీస్‌లో సిక్సుల మీద సిక్సులు కొట్టేస్తున్న రిషబ్ పంత్

విశాఖ: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అయిన గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న పంత్ మళ్లీ బ్యాటు పట్టుకుని మైదానంలోకి దిగాడు. ఐపీఎల్‌లో ఆడడానికి పంత్‌కు బీసీసీఐ నుంచి కూడా ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశాడు. రానున్న ఐపీఎల్ సీజన్‌తో తన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా కూడా పంతే వ్యవహరించనున్నాడు. ఈ సారి ఐపీఎల్‌ను బీసీసీఐ రెండు దశలుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ హోంగ్రౌండ్‌గా విశాఖను ఎంచుకుంది. దీంతో ఢిల్లీ జట్టులోని ఆటగాళ్లంతా ఇప్పటికే విశాఖ స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టారు.


ఈ క్రమంలోనే ప్రాక్టీస్‌లో నెట్స్‌లో పంత్ శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్‌లో పంత్ సిక్సుల మీద సిక్సులు బాదాడు. పంత్ సిక్సులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 26 ఏళ్ల రిషబ్ పంత్‌తోపాటు ఢిల్లీ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కాగా గతేడాది ఢిల్లీ జట్టులో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 14 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఏకంగా 9వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 98 మ్యాచ్‌లాడిన పంత్ దాదాపు 35 సగటుతో 2,838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలున్నాయి. కాగా ఈ ఐపీఎల్‌లో పంత్ సత్తా చాటితో జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

History: లక్ష్మణ్-ద్రావిడ్ చరిత్రాత్మక భాగస్వామ్యానికి 23 ఏళ్లు!

IPL 2024: కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆరంభ మ్యాచ్‌లకు జట్టు కెప్టెన్ దూరం?



Updated Date - Mar 14 , 2024 | 12:47 PM