Share News

IPL 2024: పాండ్యాకు షాకిచ్చిన లక్నో.. విండీస్ స్టార్ ప్లేయర్‌కు కీలక బాధ్యతలు

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:32 PM

ఆల్‌రౌండ్ కృనాల్ పాండ్యాకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. వైస్ కెప్టెన్‌గా అతని స్థానంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను నియమించింది. ఈ మేరకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

IPL 2024: పాండ్యాకు షాకిచ్చిన లక్నో.. విండీస్ స్టార్ ప్లేయర్‌కు కీలక బాధ్యతలు

ఆల్‌రౌండ్ కృనాల్ పాండ్యాకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. వైస్ కెప్టెన్‌గా అతని స్థానంలో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను నియమించింది. ఈ మేరకు లక్నోసూపర్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం జరిగిన ఓ ఈవెంట్‌లో కెప్టెన్ రాహుల్.. వైస్ కెప్టెన్ పూరన్‌కు 29 నంబర్ గల జెర్సీని అందించాడు. కాగా గత రెండు సీజన్లలో లక్నోసూపర్ జెయింట్స్ వైస్ కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా ఉన్నాడు. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో లక్నో ఆడిన 6 మ్యాచ్‌ల్లో పాండ్యా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 3 ఓడాడు. అయితే ఆటగాడిగా కృనాల్ పాండ్యా నుంచి ఆశించిన ప్రదర్శన మాత్రం రాలేదు.


ఇక వెస్టిండీస్ టీ20 జట్టులో కీలక ఆటగాడైన నికోలస్ పూరన్ ప్రస్తుతం చాలా టీ20 లీగ్‌లు ఆడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్, హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన పూరన్‌ను 2023 వేలంలో లక్నోసూపర్ జెయింట్స్ జట్టు రూ.16 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో పూరన్ 172 స్ట్రైక్ రేటుతో 358 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. కాగా ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. లక్నోసూపర్ జెయింట్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను 24న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్(వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినీస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 05:32 PM