Share News

IND vs ENG: చారిత్రక రికార్డుకు చేరువలో జైస్వాల్.. మరొక 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలోనే..

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:58 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. 22 ఏళ్ల వయసులోనే రికార్డులన్నింటిని బద్దలుకొడుతున్నాడు. వరుస డబుల్ సెంచరీలతో సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.

IND vs ENG: చారిత్రక రికార్డుకు చేరువలో జైస్వాల్.. మరొక 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలోనే..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ దుమ్ములేపుతున్నాడు. 22 ఏళ్ల వయసులోనే రికార్డులన్నింటిని బద్దలుకొడుతున్నాడు. వరుస డబుల్ సెంచరీలతో సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే ముగిసిన 4 టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన జైస్వాల్ ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 93 సగటుతో 655 పరుగులు చేశాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జైస్వాల్ ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే ధర్మశాల టెస్టులో ఒక పరుగు చేస్తే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జైస్వాల్ చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో ప్రస్తుతం 655 పరుగులతో టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును జైస్వాల్ బద్దలుకొడతాడు.


అలాగే ఐదో టెస్టులో మరొక 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చారిత్రక రికార్డును నెలకొల్పుతాడు. ప్రస్తుతం 692 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. దీంతో ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టే అవకాశాలున్నాయి. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే వరుసగా 3 టెస్టులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. చివరిదైన ఐదో టెస్టులోను గెలవాలని పట్టుదలగా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 04:09 PM