India vs Afghanistan: మొదటి టీ20 మ్యాచ్ టికెట్లను ఇలా బుక్ చేసుకోండి..
ABN , Publish Date - Jan 09 , 2024 | 01:13 PM
IND vs AFG: జనవరి 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 11న మొదటి మ్యాచ్, 14న రెండో మ్యాచ్, 17న మూడో మ్యాచ్ జరగనుంది. సాధారణంగా అయితే ఈ సిరీస్‌కు అంతగా క్రేజ్ ఉండేది కాదు.
మొహాలీ: జనవరి 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 11న మొదటి మ్యాచ్, 14న రెండో మ్యాచ్, 17న మూడో మ్యాచ్ జరగనుంది. సాధారణంగా అయితే ఈ సిరీస్‌కు అంతగా క్రేజ్ ఉండేది కాదు. కానీ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడనున్నారు. ఏడాదికి పైగా కాలం తర్వాత వీరిద్దరు మళ్లీ టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సిరీస్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆడబోయే చివరి టీ20 సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే మొహాలీ వేదికగా గురువారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు విడుదలయ్యాయి. పేటీఎమ్ ఇన్‌సైడర్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ల ప్రారంభం ధర రూ.500గా ఉండగా.. గరిష్ట ధర రూ.10,000గా ఉంది. దీంతో కావాల్సిన వాళ్లు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అయితే మ్యాచ్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో అర్థం కాక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మ్యాచ్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముందుగా పేటీఎమ్ ఇన్‌సైడర్ యాప్ లేదా వెబ్‌సైట్‌కు వెళ్లి లాగిన్ అవ్వండి.
2. అక్కడ భారత్ vs అఫ్ఘానిస్థాన్ తొలి టీ20 మ్యాచ్‌కు సంబంధించిన ఈవెంట్ హోంపేజీలోనే కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే సెర్చ్ చేయండి.
3. ఈవెంట్ కనిపించాక దానిపై క్లిక్ చేయండి. అప్పుడు స్టేడియానికి సంబంధించిన మ్యాప్ వస్తుంది.
4. మీకు కావాల్సిన స్టాండ్, టికెట్ల సంఖ్యను ఎంచుకోండి. టికెట్ ధరలను ఎంచుకోవడం ద్వారా కూడా మీరు మీ స్టాండ్, టికెట్లను ఎంచుకోవచ్చు.
5. ఆ తర్వాత మీకు నాలుగు స్టెప్‌లు ఉంటాయి. మొదటి స్టెప్‌లో మీ ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయండి. అప్పుడు మీ టికెట్ రిజిస్టర్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేయండి. రెండో స్టెప్‌లో మీరు భౌతికంగా టికెట్లు తీసుకోవాల్సిన అడ్రస్ చూపిస్తుంది.
6. కంటిన్యూపై క్లిక్ చేస్తే మూడో స్టెప్‌లో పన్నులతో కలిపి మీ టికెట్ ధరలను చూపిస్తుంది. మళ్లీ కంటిన్యూపై క్లిక్ చేస్తే నాలుగో స్టెప్‌లో మీ వివరాలను అడుగుతుంది. ఎంటర్ చేశాక కంటిన్యూ కొట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డబ్బులను చెల్లించిన తర్వాత మీ టికెట్లు బుక్ అయినట్టుగా ఒక నిర్ధారణను మీరు చూడొచ్చు. అంతే మీ టికెట్లు బుక్ అయిపోతాయి.