Share News

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:46 PM

Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.

Watch Video: హ్యాట్సాఫ్ టు ఇండియన్ రైల్వేస్.. వైరల్ అవుతున్న బ్యూటీఫుల్ వీడియో..!
Indian Railways Video

Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు. చూసేందుకు ఎంతో అందంగా ఉన్న ఈ వీడియోను.. రైల్వే శాఖ పనితీరును, నిబద్ధతను కొనియాడుతూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇదికాస్తా వైరల్ అయ్యింది.

గత రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో విపరీతమైన మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు దుప్పటి పరుచుకుంది. మంచు కురుస్తున్నప్పటికీ.. రవాణా వ్యవస్థ మాత్రం నడుస్తూనే ఉంది. తాజాగా మంచు కురుస్తుండగా.. నడుస్తున్న రైలుకు సంబంధించి వీడియోను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని బారాముల్లా-బనిహాల్ సెక్షన్‌లో రైలు నడుస్తోంది. ఈ వీడియోను షేర్ చేసిన మినిస్టర్.. ‘కశ్మీర్ లోయలో కురుస్తున్న మంచు’ అంటూ క్యాప్షన్ పెట్టారు. అలాగే, జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా-బనిహల్ ప్రాంతంలో భారీ మంచు కురుస్తున్నప్పటికీ.. రైలు సర్వీస్ నిరంతరాయంగా నడుస్తోందని, ఇది రైల్వే మంత్రిత్వ శాఖ అంకిత భావాన్ని ప్రదర్శిస్తోందని అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో తొలి మంచు వర్షం..

ఉధంపూర్‌లోని బసంత్‌గఢ్ లోయలో వింటర్ సీజన్ ప్రారంభం నుంచే హిమపాతం ఉంది. దీంతో ఆ ప్రాంతం అంతా శీతాకాలపు వండర్ ల్యాండ్‌గా మారిపోయింది. ఇక రియాసి జిల్లాలోని మహోర్, గుల్‌మార్గ్‌ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా మంచు దుబ్బటి కప్పినట్లుగా అందంగా కనువిందు చేస్తోంది. శ్రీనగర్‌లోనూ ఇదే వాతారణ పరిస్థితి ఉంది. ఈ సీజన్‌లో తొలిసారి తేలికపాటి మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా మనోహర దృశ్యాలతో కనువిందు చేస్తోంది.

ట్రాఫిక్‌కు అంతరాయం..

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి దెబ్బతినడం, మంచు పేరుకుపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. భారీ మంచు కురుస్తున్న కారణంగా.. పూంచ్, రాజౌరి జిల్లాలను శ్రీనగర్‌కు కలిపే మొఘల్ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కత్రాలోని ఐకానిక్ మాతా వైష్ణో దేవి ఆలయంపై మంచు పొర పేరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా, మనోహరంగా చూపరులను ఆకట్టుకుంటోంది.

వాతావరణ శాఖ అలర్ట్..

పశ్చిమ కల్లోలం కారణంగా రానున్న రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంతాలలో భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. హర్యానా, ఢిల్లీ ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్ వంటి మైదాన ప్రాంతాలలో కూడా దీని ప్రభావం ఉంటుందన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 04:10 PM