Share News

Viral Video: చాక్లెట్ తో పరోటా ఏంట్రా బాబూ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

ABN , Publish Date - Feb 05 , 2024 | 04:00 PM

ఆహా.. ఏమిరుచి.. అనరా మైమరిచి.. అని పాడుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటుంటే ఆ మజానే వేరు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ ఫుడ్ వరకు ఎన్నో వరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ డిషెస్ లో లెక్కలేనన్ని రకాలు ఉన్నాయి.

Viral Video: చాక్లెట్ తో పరోటా ఏంట్రా బాబూ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు..

ఆహా.. ఏమిరుచి.. అనరా మైమరిచి.. అని పాడుకుంటూ ఇష్టమైన ఫుడ్ ను తింటుంటే ఆ మజానే వేరు. మన దేశంలో స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ ఫుడ్ వరకు ఎన్నో వరైటీలు ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్ డిషెస్ లో లెక్కలేనన్ని రకాలు ఉన్నాయి. సాంప్రదాయ మిఠాయిల నుంచి సాయంత్రం తినే స్నాక్స్ వరకు మరెన్నో ఉన్నాయి. కాబట్టే భారతీయులు భోజనప్రియులు అనే ట్యాగ్ ను తెచ్చుకున్నారు. ఒక్కో వంటకాన్ని ఒక్కో స్టైల్ లో వండాలి. అలా చేస్తేనే అవి మంచి రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి. కాస్త డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తే కొన్ని సార్లు చక్కగా కుదరవచ్చు కుదరకపోవచ్చు. ప్రస్తుతం అలాంటి కుకింగ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చాక్లెట్ అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ చాలా ఇష్టం. ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా తియ్యని వేడుక చేసుకునేందుకు చాక్లెట్ ను లాగించేస్తుంటారు. అయితే అలాంటి చాక్లెట్ తో ఓ వ్యక్తి పరాఠా చేయడం ఫుడ్ లవర్స్ కు షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చాక్లెట్ ను ప్యాకెట్ నుంచి బయటకు తీశాడు. దానిని పిండిలా కలుపుతూ గుండ్రటి ముద్దలా చేసి పక్కన పెట్టుకున్నారు. తర్వాత కొంచెం మైదాపిండిని తీసుకుని చిన్న చపాతీలా ఒత్తుకున్నాడు. అనంతరం దానిలో ముందుగా కలిపి పెట్టుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని వేసి పిండితోనే గుండ్రంగా మూసేశాడు.


చాక్లెట్, మైదాపిండి మిశ్రమాన్ని పరాఠాలా ఒత్తుకుని వేడిగా ఉన్న పెనంపై వేశాడు. కొంత సమయం తర్వాత పరాఠాపై నెయ్యి చల్లాడు. దానిని కాల్చి రెండో వైపు కూడా నెయ్యి వేసి కాల్చుకున్నాడు. అనంతరం దానిని నాలుగు ముక్కలు చేసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చేశాడు. అంతే.. ఈ వెరైటీ డిష్ చూసి అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. దీనిపై స్పందించిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాన్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుతున్నారు. ఇలాంటివి చేసి భారతీయ ఆహారాన్ని అపహాస్యం చేయవద్దని కోరుతున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 04:03 PM