Share News

Viral Video: కింగ్ కోబ్రాతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ స్నేక్ క్యాచర్ ఏం చేశాడో చూడండి..

ABN , Publish Date - Jan 12 , 2024 | 08:03 PM

పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలిసి కూడా కొందరు చిత్రచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. అందరి ముందు హీరోల్లా బిల్డప్ ఇస్తూ కొందరు, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు..

Viral Video: కింగ్ కోబ్రాతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ స్నేక్ క్యాచర్ ఏం చేశాడో చూడండి..

పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలిసి కూడా కొందరు చిత్రచిత్రమైన పనులన్నీ చేస్తుంటారు. అందరి ముందు హీరోల్లా బిల్డప్ ఇస్తూ కొందరు, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో మరికొందరు.. పాములతో పరాచకాలు ఆడుతుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సరదా కాస్తా సీరియస్‌గా మారుతుంటుంది. అప్పుడప్పుడూ కొందరు స్నేక్ క్యాచర్లకూ ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి విషయంలో ఇలాగే జరిగింది. ఓ స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రాతో తమాషా చేస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు స్నేక్ క్యాచర్లు (Snake Catcher) ఓ గదిలో ఉంచిన పాములన్నింటినీ పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో పొడవైన కింగ్ కోబ్రా (King Cobra) వద్దకు వెళ్తారు. వారిలో ఓ వ్యక్తి దాంతో కొద్దిసేపు ఆటాడుకోవాలని చూస్తాడు. పడగ విప్పి ఉన్న కోబ్రాను కాసేపు గమనించి, తర్వాత మెల్లగా చేత్తో పట్టుకుంటాడు. అంతటితో ఆగకుండా దాని దృష్టి మల్లించి తలపై చేయి పెట్టాలని ప్రయత్నిస్తాడు. చేయి పైకి పాము తలపై పెట్టాలని చూసే లోపే పాముకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘నువ్వెంత స్నేక్ క్యాచర్ అయితే మాత్రం.. నాతోనే పరాచకలా’’.. అన్నట్లుగా బుసలు కొడుతూ కాటేసేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: బాధపడుతున్న పిల్లాడిని గమనించిన కుక్క పిల్ల.. సమీపానికి వెళ్లి మరీ సర్‌ప్రైజ్ చేసిందిలా..

అయితే వెంటనే అతను అలెర్ట్ అయి పామును పక్కకు విసిరేస్తాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పుతంది. ఈ ఘటనతో పక్కన ఉన్న వ్యక్తి కూడా షాక్ అవుతాడు. ఆ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాము కాటుకు గురయ్యేవాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పాములతో తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ కొందరు, ‘‘అవేమన్నా పెంపుడు జంతువులు అనుకున్నావా’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయకండి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30 లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పామును చూడగానే పారిపోయే ఎలుక.. ఏకంగా యుద్ధానికే దిగింది.. కారణం తెలిస్తే.. గుండె తరుక్కుపోతుంది..

Updated Date - Jan 12 , 2024 | 08:03 PM