Share News

Viral Video: మధ్యప్రదేశ్ కారును చూసి మల్లారెడ్డిని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:17 PM

కొందరు తమ వాహనాలను చిత్రవిచిత్రంగా నడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ వాహనాలను వినూత్న రీతిలో డిజైన్ చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటారు. అయితే...

Viral Video: మధ్యప్రదేశ్ కారును చూసి మల్లారెడ్డిని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

కొందరు తమ వాహనాలను చిత్రవిచిత్రంగా నడుపుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ వాహనాలను వినూత్న రీతిలో డిజైన్ చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం మరికాస్త విభిన్నంగా ఆలోచించి నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన కారు వెనుక అంటించిన స్టిక్కర్ చూసి మాజీ మంత్రి మల్లారెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా తమ వాహనాలకు దేవుళ్ల ఫొటోలు, కుంటుంబ సభ్యుల పేర్లు లేదా వింత వింత కొటేషన్లో రాస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం తన కారు వెనుక వైపు వింతగా రాశాడు. నాలుగు రోడ్ల కూడలిలో ఓ కారు ఆగి ఉంటుంది. అయితే ఆ కారు వెనుక అంటించి ఉన్న స్టిక్కర్ చూసి అంతా అవాక్కవుతాన్నారు. ‘‘ఇది ఆవు ఇచ్చిన బహుమతి’’.. అని ప్రస్తావిస్తూ (cow image sticker on the car) ఆవు స్కిక్టర్ మీద రాణి అని రాశాడు.

Viral Video: పారాగ్లైడర్‌కు ఊహించని షాక్.. నేల పైకి క్షేమంగా దిగాడు కానీ.. తీరా చూస్తే...

ఈ స్టిక్కర్ చూడగానే నెటిజన్లు మాజీ మంత్రి మల్లారెడ్డిని గుర్తు చేసుకుంటున్నారు. ‘‘పాలమ్మినా.. పూలమ్మినా’’.. అనే మల్లారెడ్డి డైలాగ్ ఎంతం ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కారు వెనుక స్టిక్కర్ చూడగానే ఇతను కూడా మల్లారెడ్డి తరహాలో పాలు అమ్మి కారు కొన్నాడేమో.. అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతను జూనియర్ మల్లారెడ్డిలా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘గోమాతను గుర్తుపెట్టుకున్నాడు.. నిజంగా గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చెట్టు పైన కొండచిలువ.. నేల పైన పందికొక్కు.. శతవిధాలా ప్రయత్నించినా చివరకు ఏమైందో చూడండి..

Updated Date - Jan 11 , 2024 | 03:17 PM