Share News

Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్లాలంటూ తొందరపెట్టిన కుక్కలు.. చివరకు యజమాని పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Jan 09 , 2024 | 07:44 PM

పెంపుడు కుక్కలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ప్రధానంగా యజమాని మాటను తూచాతప్పకుండా పాటిస్తూ.. అతడి కుటుంబ సభ్యులకూ ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాయి. అయితే కొన్నిసార్లు...

Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్లాలంటూ తొందరపెట్టిన కుక్కలు.. చివరకు యజమాని పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పెంపుడు కుక్కలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ప్రధానంగా యజమాని మాటను తూచాతప్పకుండా పాటిస్తూ.. అతడి కుటుంబ సభ్యులకూ ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని కుక్కలు ఊహించని విధంగా ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే సమయంలో తమాషా ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తు్న్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోజూ మాదిరే వాకింగ్ వెళ్లేందుకు రెడీ అవుతాడు. వెళ్తూ వెళ్తూ యథావిధిగా తన మూడు పెంపుడు కుక్కలను (pet dogs) కూడా తీసుకెళ్లాలని చూస్తాడు. అయితే ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటికే.. వాకింగ్ వెళ్లేందుకు ఉత్సాహంగా ఉన్న కుక్కలు ఎప్పుడెప్పుడు గడప దాటి పోదామా అని కంగారుపడుతుంటాయి. యజమానేమో కుక్కలను బెల్టుతో పట్టుకుని, గడప వద్ద షూలు వేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే ఎంతో ఓపికగా ఉన్న కుక్కలు.. యజమాని ఇలా ఆలస్యం చేయడాన్ని అసలు సహించలేవు. ‘‘వాకింగ్‌కు లేటవుతుంటే.. ఈ ఆలస్యమేంటి బాస్.. మామూలుగా చెబితే నువ్వు వినవు’’.. అని అనుకున్నట్లుగా.. అన్నీ కలిసి ఒకేసారి పరుగందుకుంటాయి.

Private Jets: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్ విమానాలు కలిగి ఉన్న.. ఆ ఆరుగురు ఎవరో తెలుసా..

కుక్కలు ఒక్కసారిగా లాగేయడంతో యజమానికి ధమేల్ కిందపడిపోతాడు. ఈ క్రమంలో అతడి ప్యాంట్ కూడా ఊడిపోతుంది. అయినా కుక్కలు అతన్ని లాక్కుంటూ బయటికి వెళ్లిపోతాయి. ఈ ఘటనతో ఆ వ్యక్తి భార్య పరుగెత్తుకుంటూ వస్తుంది. అప్పటికే కుక్కలు అతన్ని బయటికి లాక్కెళ్లి ఉంటాయి. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ కుక్కలు చాలా స్పీడ్‌గా ఉన్నాయే’’.. అంటూ కొందరు, ‘‘వీటికి సమయం వృథా చేయడం నచ్చదేమో’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గేదే కదా ఏం చేస్తుందిలే అనుకుని సమీపానికి వచ్చిన బైకర్.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - Jan 09 , 2024 | 07:44 PM