Share News

Viral Video: ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ... ఒలంపిక్స్‌కి పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం..

ABN , Publish Date - Jan 12 , 2024 | 03:16 PM

శిక్షణ పొందిన కొన్ని జంతువులు మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని జంతువులు ఎలాంటి ట్రైనింగ్ లేకున్న మనుషులను అనుకరిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని మనుషుల్లాగే...

Viral Video: ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ... ఒలంపిక్స్‌కి పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం..

శిక్షణ పొందిన కొన్ని జంతువులు మనుషుల్లాగే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని జంతువులు ఎలాంటి ట్రైనింగ్ లేకున్న మనుషులను అనుకరిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్ని మనుషుల్లాగే చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి జంతువుల వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా, ఓ గొర్రె వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ గొర్రె చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ ఎవర్రా దీనికి ట్రైనింగ్ ఇచ్చిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఇంటికి వచ్చిన వారు సౌండ్ చేయకుండా గేటు దూకి లోపలికి వెళ్లడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే పని జంతువులు చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగో ఈ గొర్రెలా ఉంటుంది. విషయం ఏంటంటే.. బయటికి వెళ్లిన రెండు గొర్రెలు ( sheep) .. మంద వద్దకు ఆలస్యంగా వస్తాయి. అయితే అప్పటికే వాటి యజమాని గేటు వేసి ఉంటాడు. ఆలస్యంగా రావడాన్ని తమ యజమాని చూస్తే ఎక్కడ కొడతాడో అని భయపడ్డాయో ఏమో గానీ.. ఎలాగైనా లోపలికి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నాయి.

Viral Video: ఈ బామ్మ తెలివికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. చేతులతో అల్లిన స్వెట్టర్‌ను చిన్న ట్రిక్‌తో ఎలా మార్చిందంటే..

అయితే వాటిలో గొర్రె మాత్రం ‘‘నా వల్ల కాదు బాబోయ్’’.. అన్నట్లుగా నిస్సహాయంగా నిలబడి ఉంటుంది. మరో గొర్రె మాత్రం అటూ ఇటూ చూడగా.. చివరకు దానికి ఓ బంపర్ ఐడియా వస్తుంది. ఏ సినిమాలో చూసి నేర్చుకుందో ఏమో గానీ... వేగంగా పరుగందుకుని గోడపైకి ఎగిరి, అటు నుంచి అటే గేటు అవతలకు దూకేస్తుంది. అయితే మరో గొర్రె మాత్రం ఆ స్టంట్ చేయలేక అక్కడే నిలబడి ఉంటుంది. ఈ ఘటనను వాటి యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గొర్రె సినిమాలు బాగా చూస్తుందేమో’’... అంటూ కొందరు, ‘‘దీన్ని ఒలంపిక్స్‌కు పంపిస్తే గోల్డ్ మెడల్ ఖాయం’’.. అంటూ మరికొందరు, ‘‘వావ్! స్టంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: బురదలో ఇరుక్కుపోయిన ఖడ్గమృగాన్ని చుట్టుముట్టిన సింహాలు.. కాపాడేందుకు ఎంతో ప్రయత్నించిన ఏనుగు.. అయితే..

Updated Date - Jan 12 , 2024 | 03:16 PM