Share News

Viral Video: పోయేకాలాన్ని కొనితెచ్చుకోవడం అంటే ఇదేనేమో..!

ABN , Publish Date - May 25 , 2024 | 04:12 PM

నేటి సోషల్ మీడియా యుగంలో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది తమ జీవితాలనే రిస్క్‌లో పెడుతున్నారు. చిత్రవిచిత్రంగా రీల్స్ చేస్తున్నారు. సాధారణంగా బైక్‌పై స్టంట్స్ చేయడం ప్రమాదం. కానీ కొంతమంది లైక్స్, వ్యూస్‌తో పాటు పాపులారిటీ కోసం స్టంట్స్ చేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం.

Viral Video: పోయేకాలాన్ని కొనితెచ్చుకోవడం అంటే ఇదేనేమో..!
Stunts on Bike

నేటి సోషల్ మీడియా యుగంలో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది తమ జీవితాలనే రిస్క్‌లో పెడుతున్నారు. చిత్రవిచిత్రంగా రీల్స్ చేస్తున్నారు. సాధారణంగా బైక్‌పై స్టంట్స్ చేయడం ప్రమాదం. కానీ కొంతమంది లైక్స్, వ్యూస్‌తో పాటు పాపులారిటీ కోసం స్టంట్స్ చేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మనం అలాగే చేయాలనే భావనతో కొందరు రిస్క్‌చేస్తూ స్టంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.


స్టంట్స్‌కు సంబంధించిన వీడియోస్‌ను ఎక్కువమంది ఇష్టపడుతుూ ఉంటారు. దీంతో ఇలాంటి రీల్స్ చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. బైక్‌పై స్టంట్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో బైక్ నడుపుతున్న వ్యక్తి వెనకాల ఓ వ్యక్తిని కూర్చోబెట్టుకుని స్టంట్స్ చేస్తుండగా.. వెనకాల కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Opitcal Illusion: మీ దృష్టి నైపుణ్యానికి అసలైన పరీక్ష.. ఈ ఫొటోలో ఉడుత ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!


ఎంతో రిస్క్‌..

ఎవరో మెప్పుకోసం జీవితాలను రిస్క్‌లో పెట్టి.. బైక్‌పై స్టంట్స్ చేయడం ఎంతో ప్రమాదకరం. బైక్‌పై విన్యాసాలు చేయడం చట్టబద్ధమైన ఆటలు కాదనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. వీడియోలు చేసి విన్యాసాలు చేయాలనుకోవడం సరికాదు. స్టంట్స్ చేయడానికి ఎంతో ప్రాక్టీస్, అనుభవం అవసరం. సాధారణంగా ఏవైనా విన్యాసాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయనే భావనతో నేటి యువత బైక్‌పై స్టంట్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఒక బైక్‌పై ఇద్దరు వ్యక్తులు స్టంట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వీడియోలో ఏముంది..

ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్‌పై కూర్చుని స్టంట్స్ చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. బైక్ రైడర్ విన్యాసాలు చేయడంతో వెనుక ఉన్న వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేక రోడ్డుకు తల తగలడం ద్వారా తీవ్రంగా గాయపడటం వీడియోలో చూడొచ్చు. ఇలాంటి ఘటనల ద్వారా చావును కోరి తెచ్చుకున్నట్లే అనే భావన ఏర్పడుతుంది. బైక్‌పై వెనకాల కూర్చుకున్న యువకుడు తీవ్రంగా గాయపడిన విషయంలో వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


స్పష్టత లేనప్పటికీ..

ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే స్పష్టత లేనప్పటికీ ఓ వ్యక్తి ఎక్స్‌లో వీడియోను షేర్ చేశారు. బైక్‌పై స్టంట్స్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల కొందరు వీక్షిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరి రెస్ట్ తీసుకోవడానికి ఇలా చేస్తున్నారంటూ ఒకరు కామెంట్ చేయగా.. స్టంట్స్ అనేది ఆట కాదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. స్టంట్స్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని ఉండవచ్చు.. కానీ అలాంటి పొరపాట్లు చేయకూడదంటూ మరో నెటిజన్ స్పందించాడు.


Viral Video: ముళ్ల పందిని పట్టుకోబోయి గాయపడిన చిరుత.. తర్వాతేం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 25 , 2024 | 04:12 PM