Share News

Viral video: మెట్రో రైల్లో ప్రేమికుల పాడు పని.. ప్రయాణికుడి ఫిర్యాదుకు పోలీసుల రియాక్షన్ ఇదీ..

ABN , Publish Date - May 06 , 2024 | 09:02 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు మెట్రో రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్లో వెళ్తున్న ఓ ప్రేమ జంట ఉన్నట్టుండి ప్రయాణికలందరికీ షాక్ ఇచ్చింది. అప్పటిదాకా నిలబడి ఉన్న వారు ఉన్నట్టుండి ..

Viral video: మెట్రో రైల్లో ప్రేమికుల పాడు పని.. ప్రయాణికుడి ఫిర్యాదుకు పోలీసుల రియాక్షన్ ఇదీ..

ఢిల్లీ, ముంబై మెట్రో రైలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు సీటు కోసం ప్రయాణికులు కుస్తీ పడుతుంటే.. మరికొన్నిసార్లు యువతులు చిత్రవిచత్ర డాన్సులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. అలాగే ఇంకొన్నిసార్లు ప్రేమికులు చేయకూడని పనులన్నీ రైళ్లలోనే చేసేస్తుంటారు. తాజాగా, బెంగళూరు మెట్రో రైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట రైల్లో ప్రయాణికుల సమక్షంలోనే అసభ్యకరంగా ప్రవర్తించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బెంగళూరు మెట్రో (Bangalore Metro) రైల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్లో వెళ్తున్న ఓ ప్రేమ జంట (lovers) ఉన్నట్టుండి ప్రయాణికలందరికీ షాక్ ఇచ్చింది. అప్పటిదాకా నిలబడి ఉన్న వారు.. ఉన్నట్టుండి ఒకరినొకరు కౌగిలించుకుంటూ (Indecent behavior) అసభ్యకరంగా ప్రవర్తించారు. పక్కన అంతా చూస్తున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు.

Viral video: వామ్మో..! ఇదెలా సాధ్యం.. కారులోకి దూరిన ఒంటె.. ఇలా బయటికొచ్చిందేంటీ..


ప్రేమికులు చాలా సేపు అలాగే ప్రవర్తించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెంగళూరు మెట్రో కూడా ఢిల్లీలా మారుతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలపై స్పందించాలంటూ పోలీసులకు ఈ వీడియోను ట్యాగ్ చేశారు. అయితే ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు స్పందించారు. నేరుగా తమకు మెసేజ్ చేసి పూర్తి సమాచారం అందిస్తే.. చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.

Viral video: పొలాల్లోకి వెళ్లిన పెళ్లికొడుకు.. చివరకు అతిథులకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూస్తే..


కాగా, ప్రేమికులు ముద్దులు పెట్టుకుంటున్న వీడియో చూసిన నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కర్నాటక మెట్రోలో అసలు ఏం జరుగుతోంది’’.., ‘‘వారు ఎవరికీ ఇబ్బంది కలిగించలేదు కదా’’.., ‘‘కౌగిలించుకోవడంలో తప్పేముందీ’’.., ‘‘రైల్లో కౌగిలించుకున్నారు.. ఇప్పుడేమో కోట్ల జనాభా వరకూ చేరుకున్నారు’’.., ‘‘ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: అయ్య బాబోయ్..! అతి పెద్ద అనకొండతో ఈత కొట్టాడు.. సమీపానికి వెళ్లడంతో.. చివరికి..

Updated Date - May 06 , 2024 | 09:02 PM