Share News

Viral video: వామ్మో..! ఇదెలా సాధ్యం.. కారులోకి దూరిన ఒంటె.. ఇలా బయటికొచ్చిందేంటీ..

ABN , Publish Date - May 06 , 2024 | 06:43 PM

అడవి జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. గ్రామాల్లోకి చొరబడే పులులు, సింహాలు, ఏనుగులు.. అనుకోని విధంగా ప్రమాదాల్లో చిక్కుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఓ ఒంటెకూ ఇలాంటి కష్టమే వచ్చింది. ప్రమాదవశాత్తు ఒంటె కారులోకి దూరింది. బయటికి ఎలా రావాలో అర్థం కాక గిలాగిలా కొట్టుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral video: వామ్మో..! ఇదెలా సాధ్యం.. కారులోకి దూరిన ఒంటె.. ఇలా బయటికొచ్చిందేంటీ..

పులులు, సింహాలు, ఏనుగులు, ఒంటెలు తదితర జంతువులు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అడవుల నుంచి గ్రామాల్లోకి ప్రవేశించిడం, మరికొన్నిసార్లు ఏకంగా ఇళ్లల్లోకి చొరబడడం చేస్తుంటాయి. ఈ క్రమంలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఒంటెకు సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఒంటె ఏకంగా కారులోకే దూరింది. చివరకు ఎలా బయటికి వచ్చిందో చూస్తే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఎవరైనా బలంతంగా తోశారో, లేదా అదే పొరపాటున వెళ్లిందో ఏమో తెలీదు గానీ.. ఓ ఒంటె ఏకంగా (camel entering car) కారులోకి దూరింది. ముందు డోరు నుంచి లోపలికి వెళ్లిన ఒంటె.. తిరిగి బయటికి వచ్చే విధానం తెలీక గిలాగిలా కొట్టుకుంది. ఈ క్రమంలో పాపం దాని కాలు కూడా విరిగినట్లుంది. కారు నుంచి బయటికి వచ్చే క్రమంలో ఒంటె చివరకు కారు పైకప్పును ధ్వంసం చేసింది. ఆ తర్వాత అందులో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేసింది.

Viral video: టీ తాగడం మరీ ఇంత కష్టమా.. వీళ్లు పడ్డ శ్రమ చూస్తే అవాక్కవ్వాల్సిందే..


ఈ క్రమంలో తల బయటికి పెట్టి శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కడున్న వారు గమనించినా కాపాడేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో చాలా మంది దూరంగా నిలబడి చూస్తుండిపోయారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఒంటె కారులోకి ఎలా వెళ్లింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: పొలాల్లోకి వెళ్లిన పెళ్లికొడుకు.. చివరకు అతిథులకు ఎలాంటి షాక్ ఇచ్చాడో చూస్తే..

Updated Date - May 06 , 2024 | 06:43 PM