Share News

Viral News: అమ్మాయికి దెయ్యం పట్టిందన్నాడు.. రూమ్‌లోకి వెళ్లాడు.. తీరా చూస్తే..

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:39 PM

మైనర్ బాలికకు దెయ్యం పట్టిందని చెప్పి ఓ మతగురువు దారుణానికి పాల్పడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శృంగారంతోనే దెయ్యం..

Viral News: అమ్మాయికి దెయ్యం పట్టిందన్నాడు.. రూమ్‌లోకి వెళ్లాడు.. తీరా చూస్తే..
Karnataka News

మైనర్ బాలికకు దెయ్యం పట్టిందని చెప్పి ఓ మతగురువు దారుణానికి పాల్పడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శృంగారంతోనే దెయ్యం వీడుతుందని నమ్మించి, ఆ అమ్మాయిపై రాక్షసుడిలా ఎగబడి తన కామవాంఛ తీర్చుకున్నాడు. తీరా ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో.. అతని నేరం బట్టబయలైంది. ఈ ఘటన కర్ణాటకలో (Karnataka) చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


Read Also: క్రికెట్‌లో విషాదం.. సిక్స్ కొట్టిన తర్వాత ప్రాణం విడిచిన క్రికెటర్

ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన ఓ మతగురువు కర్ణాటకలోకి చిత్రదుర్గలో ఉన్న స్థానిక మసీదులో ఉంటున్నాడు. అతని వద్దకు ఒక మైనర్ బాలిక గత మూడేళ్లుగా ఖురాన్ అధ్యయనాలకు హాజరవుతూ వచ్చింది. అయితే.. ఒకరోజు ఆ బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న మతగురువు.. ఆమె ఇంటికి వెళ్లి చికిత్స అందించాడు. అప్పుడే అతని బుద్ధి మారింది. అప్పటివరకూ ఆ బాలికని తన కూతురిలా చూసుకున్న ఆ మతగురువు.. చికిత్స అందించిన టైంలో ఆమెపై కన్నేశాడు. అమ్మాయికి దెయ్యం పట్టిందని, శృంగారం వల్లే అది నయమవుతుందని ఆమె సోదరుడ్ని నమ్మించాడు. లైంగిక వేధింపులకు పాల్పడేలా సోదరుడ్ని ప్రేరేపించాడు. ఆపై ఆ తతంగాన్ని ఫోన్‌లో రికార్డ్ చేశాడు.


Read Also: గాల్లో ఢీ కొట్టుకున్న రెండు విమానాలు.. ఆ తర్వాత ఏమైందంటే?

అనంతరం ఆ మతగురువు కూడా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు ఇష్టం లేదని ఆ యువతి చెప్పినా.. బలవంతంగా అత్యాచారం చేశాడు. వారానికి ఓసారి చొప్పున.. ఆరు, ఏడు నెలల పాటు ఆ బాలికని వేధించాడు. ఓరోజు బాలికకి తీవ్ర కడుపునొప్పి రావడంతో.. తల్లి ఆమెను ఆసుపత్రిలో చేర్పించింది. అప్పుడే ఆ మతగురువు నిజం బయటపడింది. తనకు దెయ్యం పట్టిందని చెప్పి ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక చెప్పడంతో.. వెంటనే తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ మతగురువుని అరెస్ట్ చేశారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 06:39 PM