Share News

Anand Mahindra: పిల్లలకు ముందు ఇలాంటివి నేర్పండి.. వైరల్ గా మారిన ఆనంద్ మహీంద్రా పోస్ట్..

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:26 PM

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి వైరల్ గా మారారు.

Anand Mahindra: పిల్లలకు ముందు ఇలాంటివి నేర్పండి.. వైరల్ గా మారిన ఆనంద్ మహీంద్రా పోస్ట్..

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి వైరల్ గా మారారు. విద్యార్థులకు సంబంధించిన ఓ వీడియోను ఆయన తన ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. పరిశుభ్రత, సహకారం వంటి అంశాలపై చిన్నతనంలోనే చిన్నారులకు ఎలా నేర్పించాలనే అంశం ఈ వీడియోలో ఉంది. ప్రీ-ఎలిమెంటరీ, ఎలిమెంటరీ పాఠశాలలు ఈ విధానాన్ని పాటించాలని కోరారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో.. ఒక ఉపాధ్యాయురాలు ఫ్లోర్ పై వివిధ రకాల బొమ్మలను వేయడాన్ని చూడవచ్చు. అనంతరం విద్యార్థులందరినీ తరగతి గదిలోకి తీసుకువచ్చింది. వెంటనే వారు అప్రమత్తమై.. తరగతి గదిని పరిశీలించి, వెంటనే శుభ్రం చేయడం ప్రారంభిస్తారు. బొమ్మలు తీయడం, వాటిని ఒక పెట్టెలో అమర్చడం చూడవచ్చు. ఫర్నీచర్ కూడా చక్కబెట్టి, అన్నీ మునుపటి లాగే ఎలా ఉందో అలాగే ఉంచారు.

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో.. జనవరి 7 న షేర్ అయింది. పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియోకు ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. "ఐడియా చాలా బాగుంది, కానీ పాఠశాలల కంటే మనం మొదట ఇంట్లో ఇలాంటి పనులను నేర్పించాలి." "ఇది గొప్ప ఆలోచన. చదువులో భాగంగా ఈ రకమైన పనులు కచ్చితంగా చేయాలి అని నెటిజన్లు తమ అభిప్రాయాలను రాస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 01:35 PM