Share News

Baby Hippo: పిల్ల హిప్పో వీడియో వైరల్.. క్రేజ్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Sep 24 , 2024 | 06:07 PM

థాయ్‌లాండ్‌లోని ఖావో ఖీవ్ ఓపెన్ జంతు ప్రదర్శనశాలలో "మూ డెంగ్" అనే రెండు నెలల వయసున్న హిప్పో పిల్ల ఉంది. అది ఈ ఏడాది జులై 10న జన్మించింది. దాన్ని ప్రజలు వీక్షించేందుకు జులై 25నుంచి అనుమతించారు.

Baby Hippo: పిల్ల హిప్పో వీడియో వైరల్.. క్రేజ్ మామూలుగా లేదుగా..

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రపంచంలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ హిప్పో పిల్లకు సంబంధించిన వీడియో సైతం తెగ వైరల్‌గా మారింది. పిల్ల హిప్పో స్నానం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. స్నానం చేస్తున్నప్పుడు దాన్ని చేష్టలు, వెనక నుంచి వస్తున్న బాలిక మాటలు రెండూ చేరి చూసేందుకు భలే అనిపిస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు పిల్ల హిప్పోలు ఇంత అందంగా, సరదాగా ఉంటాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


థాయ్‌లాండ్‌లోని ఖావో ఖీవ్ ఓపెన్ జంతు ప్రదర్శనశాలలో "మూ డెంగ్" అనే రెండు నెలల వయసున్న హిప్పో పిల్ల ఉంది. అది ఈ ఏడాది జులై 10న జన్మించింది. దాన్ని ప్రజలు వీక్షించేందుకు జులై 25నుంచి అనుమతించారు. అయితే తాజాగా ఆ పిల్ల హిప్పోకు సంబంధించిన వీడియో నెటింట తెగ వైరల్‌గా మారింది. మూ డెంగ్ చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. అయితే ప్రజలు జంతు ప్రదర్శన శాలకు వెళ్లిన సమయంలో మూ డెంగ్‌కు నిర్వాహకులు స్నానం చేయిస్తున్నారు. దాన్ని ఓ టబ్బులో కూర్చోపెట్టి పైపుతో నీటిని కొడుతున్నారు. అది కూడా అరుస్తూ ఇంకా నీటిని తనపై పోయండి అన్నట్లు తలెను పైకెత్తి అటూఇటూ తిప్పుతోంది. పిల్ల హిప్పోను టబ్బులో కూర్చొపెట్టడం, దానికి స్నానం చేయించడం, అది సరదాగా ఆడుకోవడం చూసేందుకు భలే సరదాగా అనిపిస్తోంది. అదే సమయంలో జూకి వచ్చిన ఓ చిన్నారి దానికి "హాయ్.. హాయ్.. గుడ్ మార్నింగ్" అని చెప్పడం కూడా వీడియో చూసేందుకు మరింత సరదాగా అనిపిస్తోంది. వారిద్దరూ త్వరలో మంచి మిత్రులు అవుతారంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


ఈ వీడియోను @twaniimals అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయ్యింది. ఇది కాస్తా వైరల్‌గా మారి 1.8మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అయితే వీడియో చూసిన వారంతా ఇంత అందమైన హిప్పో పిల్లను ఎక్కడా చూడలేదని అంటున్నారు. మూ డెంగ్.. అట్టపోన్ నుండీ అనే జూ కీపర్ సంరక్షణలో ఉంటోంది. అది పుట్టినప్పటి నుంచీ చాలా అందంగా ఉందని అట్టపోన్ నుండీ చెప్తున్నారు. దాని రూపురేఖలు, సదరాగా ఉండే తత్వం వల్ల అది దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని తానే ముందే ఊహించినట్లు చెప్పారు. అయితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని తాను ఊహించలేదని ఆయన అంటున్నారు.


మరోవైపు వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. "ఇంత అందమైన పిల్ల హిప్పోను మేము ఇంతవరకూ చూడలేదని, ఈ వీడియో చూసేందుకు చాలా సరదాగా ఉందని, దాదాపు గంట సేపు ఈ వీడియో చూస్తూ అలానే ఉండిపోయానని, ఇలాంటి హిప్పోను నేను కూడా పెంచుకుంటా, పిల్ల హిప్పో టబ్బులో ఆడుకోవడం సరదాగా ఉందంటూ" పలు రకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 06:10 PM