Share News

Viral Video: వాహనాలు ఢీకొనే క్షణాల ముందు ఏం జరుగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా..

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:42 PM

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొందరు మద్యం సేవించి వాహనాలు నడపడం, మరికొందరు అత్యంత వేగంగా డ్రైవింగ్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి...

Viral Video: వాహనాలు ఢీకొనే క్షణాల ముందు ఏం జరుగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా..

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొందరు మద్యం సేవించి వాహనాలు నడపడం, మరికొందరు అత్యంత వేగంగా డ్రైవింగ్ చేయడం తదితర కారణాల వల్ల ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఓ వ్యక్తి వాహనదారులక అవగాహన కల్పిస్తూ చేసిన వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రెండు వాహనాలు ఢీకొనే సమయంలో ఏం జరుగుతుందో 3 డీ గ్రాఫిక్స్ ద్వారా వారు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాలు వేగంగా నడపడం వల్ల ఎంత నష్టమో రోజూ చూస్తున్నా కూడా చాలా మంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వాహనాలు ఢీకొనే సమయంలో (Vehicle collision) ఏం జరుగుతుందో ఊహిస్తూ ఓ వ్యక్తి 3 డీ గ్రాఫిక్స్ (3D graphics) ద్వారా చేసిన వీడియో అంతా అవాక్కయ్యేలా చేస్తోంది. ఓ బైకర్ రోడ్డుపై అత్యంత వేగంగా వెళ్తుంటాడు.

Puzzle: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి.. వాటిని 40 సెకన్లలో కనుక్కున్నారంటే మీరు తోపే..


అలా వేగంగా వెళ్తు్న్న సమయంలో మరో బైకర్ అతడి కంటే వేగంగా వెళ్తుంటాడు. దీంతో అతన్ని ఓవర్‌టేక్ చేయాలనే ఉద్దేశంతో ఇతను తన వాహనాన్ని మరింత వేగంగా నడుపుతుంటాడు. ఈ క్రమంలో మినీ వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేయబోతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. వ్యాన్‌ను ఓవర్‌టేక్ చేసి కాస్త ముందుకు వెళ్లగానే ఎదురుగా ఓ లారీ వస్తుంది. బైకు, లారీ ఢీకొనే సమయంలో ఒక్కసారిగా వీడియో ఫ్రీజ్ అవుతుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన దెయ్యం లాంటి ఆకారం పొంచి ఉంటుంది.

Viral Video: సింహాల గుంపు మధ్యలో చిక్కుకుపోయిన గేదెలు... గేదెను కాపాడుకునేందుకు చివరకు ఏం చేశాయో చూడండి..


బైకర్‌ను లారీ ఢీకొనగానే దెయ్యం రోడ్డు మధ్యలోకి దూసుకొస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అక్కడ బైకు నడుపుతున్నది మేమే అన్నట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, ‘‘అతివేగం ఎంత ప్రమాదకరమో... కళ్లకు కట్టినట్లు చూపించారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం కోటికి పైగా లైక్‌లను సొతం చేసుకుంది.

Viral Video: నిద్రపోతున్న వ్యక్తి చొక్కాలోకి దూరిన పాము.. ఏమైందా అని చూడగా చివరకు షాకింగ్ సీన్..

Updated Date - Jun 05 , 2024 | 05:06 PM