Share News

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:43 PM

పులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే అవి ఎంతో తెలివిగా ప్రవర్తించే ఘటనలు.. చాలా అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. సింహాలు కొన్నిసార్లు అత్యంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా..

Viral Video: ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని.. ఈ రెండు సింహాలు చిన్న టెక్నిక్‌తో ఎలా దాటాయో చూడండి...

పులులు, సింహాల వేటకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే అవి ఎంతో తెలివిగా ప్రవర్తించే ఘటనలు.. చాలా అరుదుగా చోటు చేసుకుంటుంటాయి. సింహాలు కొన్నిసార్లు అత్యంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అడవి మధ్యలో సింహాలు ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటాల్సి వచ్చింది. అయితే అవి సింపుల్ టెక్నిక్‌తో నదిని ఈజీగా దాటేశాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కెన్యాలోని (Kenya) మాసాయి మారా నేషనల్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు సింహాలు ఆహార వేటలో భాగంగా అడవిలో అటూ తిరుగుతుంటాయి. అయితే ఈ క్రమంలో సింహాలు.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాటాల్సి వచ్చింది. నది ఎంతో ఉదృతంగా ప్రవహిస్తుండడంతో ఆ మూడు సింహాలు ఒడ్డున నిలబడి చాలా సేపు ఆలోచించాయి. చివరకు వాటిలో ఓ సింహం ధైర్యం చేసి నదిని దాటేందుకు ముందుకు వచ్చింది.

Viral Video: ఎవరూ లేని సమయంలో ఆఫీసులో యువతి నిర్వాకం.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అవాక్కయ్యే సీన్..


నది నీటిలో దిగిన ఆ సింహం కాసేపు ఆగి పరిస్థితిని అంచనా వేసింది. దీంతో వెనుక ఉన్న రెండు సింహాలు కూడా నదిని దాటేందుకు సిద్ధమయ్యాయి. ముందు వెళ్లిన సింహం నీళ్లలోకి దూకి, నదీ ప్రవాహానికి అనుగుణంగా కొట్టుకెళ్తూనే కాళ్ల సాయంతో అటు వైపు జరుగుతూ వెళ్లింది. దాని వెనుకే మరో సింహం కూడా అదే విధంగా ఈదుతూ వెళ్లింది. ఇలా రెండు సింహాలు ఎంతో చాకచక్యంగా (lions crossed the river very cleverly) నదిని సింపుల్‌గా దాటేశాయి.

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..


రెండు సింహాలు నదిని సులభంగా దాటేసినా.. మూడో సింహం మాత్రం అంత ధైర్యం చేయలేక నది అవతలే ఉండిపోయింది. ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ సింహాల తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘సింహాల టెక్నిక్ అద్భుతంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొండచిలువ ఆహారం ఎలా తింటుందో ఎప్పుడైనా చూశారా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Updated Date - Jun 02 , 2024 | 05:43 PM